ఉత్తర్‌ప్రదేశ్, ఆగ్రాలో ని ఓ ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు చూస్తే.. ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.. జులై నెలకు ఆ ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు రూ. 829 బిలియన్లు.
ఇంత బిల్లు ఎలా?
ఉత్తర్‌ప్రదేశ్, ఆగ్రాలో ని ఓ ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు చూస్తే.. ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.. జులై నెలకు ఆ ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు రూ. 829 బిలియన్లు.
ఇంత బిల్లు ఎలా?
ఆగ్రా, దయాల్బాగ్లోని సౌరభ్ ఎన్‌క్లేవ్‌లో సురేంద్ర ప్రతాప్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆయన ఇంటికి జులై నెలకు గానూ కరెంట్ బిల్లు రూ. 3,132 వచ్చింది. అయితే ఆన్లైన్లో మాత్రం ఆయన బిల్లు రూ. 829829829829.00. చూపించింది.
దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన సురేంద్ర.. విద్యుత్ అధికారులను సంప్రదించాడు. సాంకేతిక సమస్యల కారణంగా ఆన్లైన్లో అలా వచ్చిందని అధికారులు వివరించటంతో ఆయన ఊపిరిపీల్చుకున్నాడు. ఈ బిల్లు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఇదీ చదవండి:Biryani: 5 పైసలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం