Consultation With Rebel Candidates in Assembly Elections : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరులో అన్ని పార్టీలకు రెబల్స్ బెడదతో గుబులు రేగుతోంది. ప్రధానంగా టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులు తిరుగుబాటుదారులుగా ఎన్నికల బరిలో ఉండటం కాంగ్రెస్ అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. పోటీ ఎక్కువ ఉన్నచోట ఓట్లు చీల్చితే.. తలరాత తారుమారు అవుతుందని భయపడుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగి బుజ్జగింపులతో అసంతృప్తులను సముదాయిస్తోంది.
ఓట్లు చీలకుండా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్ఠానం : పోటీ నుంచి తప్పుకునేలా విశ్వప్రయత్నాలు(World Endeavours) చేస్తోంది. నామినేషన్‌ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగియనుండటంతో తిరుగుబాటు అభ్యర్థులను కాంగ్రెస్ నాయకత్వం బుజ్జగిస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్.. రెబల్స్‌తో సమావేశమై వారిని సముదాయిస్తున్నారు. సూర్యాపేట, బోథ్, వైరా, ఇబ్రహీంపట్నం, ఆదిలాబాద్, వరంగల్ పశ్చిమ, నర్సాపూర్ ఇలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులు స్వతంత్రంగా లేదా ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ తరఫున పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.
'తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటోంది'
Dissent Leaders Issue in Political Parties :ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్న ఠాక్రే.. నామినేషన్లు వెనక్కి తీసుకుని పార్టీ అభ్యర్థి గెలుపునకు సహకరించాలని సూచిస్తున్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వం వస్తే నామినేటెడ్ పదవులు(Nominated Posts) ఇస్తామని వారికి భరోసా ఇస్తున్నారు. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా తిరుగుబాటు చేసిన వారు తగ్గుతారా.. లేదంటే పోటీకి సిద్ధమవుతారా..? అనేది బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి, ఆదిలాబాద్‌లో సంజీవరెడ్డి, ఇబ్రహీంపట్నంలో దండెం రాంరెడ్డి తదితరులు బలమైన నాయకులుగా ఉన్నారు. ఓట్లలో చీలిక రాకుండా కాంగ్రెస్ అధినాయకత్వం చర్యలు చేపడుతోంది.