తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చలి, చీకట్లోనూ ఆగని రామ మందిర నిర్మాణం- ఈ నెలాఖర్లోగా..

Construction of Ram temple: అయోధ్యలో రామ మందిర నిర్మాణం రాత్రి, పగలు అన్న తేడా లేకుండా వేగంగా జరుగుతోంది. 40 మంది ఇంజినీర్ల పర్యవేక్షణలో 250 మంది కూలీలు పనిచేస్తున్నారని ఆలయ ట్రస్ట్ అధికారులు వెల్లడించారు.

construction of ram temple
construction of ram temple

By

Published : Jan 15, 2022, 6:56 PM IST

Ayodhya Temple construction status: అయోధ్యలో రామ మందిరం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. తీవ్రమైన చలితోనూ పనులు కొనసాగుతున్నాయి. రాత్రి వేళ సైతం నిర్విఘ్నంగా నిర్మాణ పనులు చేపడుతున్నారు ఇంజినీర్లు.

పనులపై ఇంజినీర్ల మంతనాలు..
నిరంతరాయంగా నిర్మాణ పనులు

Sri Ram Janmabhoomi trust

ఇప్పటివరకు మందిర నిర్మాణం 30 శాతం పూర్తైందని ఆలయ ట్రస్ట్ అధికారులు శుక్రవారం వెల్లడించారు. మిగిలిన పని మూడున్నరేళ్లలో పూర్తవుతుందని తెలిపారు. జనవరి చివరి నాటికి రెండో దశ నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు.

ఫ్లడ్ లైట్ల వెలుతురులో...
రాత్రి వేళ పనిచేస్తున్న క్రేన్లు

Ayodhya Temple construction update

"పునాది పనుల్లో ఓ భాగం పూర్తైంది. రెండో పునాది పనులు కొనసాగుతున్నాయి. జనవరిలోనే ఇది పూర్తవుతుంది. అయోధ్యలో తీవ్రమైన చలి ఉన్నా.. పగలూ రాత్రి అన్న తేడా లేకుండా పనులు జరుగుతున్నాయి. 40 మంది ఇంజినీర్ల పర్యవేక్షణలో 250 మంది కూలీలు పనులు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి కూలీల సంఖ్యను పెంచుతాం. అయోధ్యలో జరుగుతున్న నిర్మాణ పనులపై ఇప్పటికే త్రీడీ యానిమేషన్ వీడియోను యూట్యూబ్​లో విడుదల చేశాం."

-చంపత్ రాయ్, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్

కాంక్రీటు పనులను ఎల్ అండ్ టీ చేపట్టిందని సాంకేతిక నిపుణుడు జగదీశ్ అఫ్దే తెలిపారు. డిజైన్, పీఎంసీ పనులు టాటా కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని చెప్పారు. 'మందిరం పనులు మరో రెండేళ్లు జరగనున్నాయి. గోడ నిర్మాణం ఒకటిన్నరేళ్లు పడుతుంది. మిర్జాపుర్​తో పాటు దక్షిణ భారతదేశం నుంచి స్తంభాలను తీసుకొస్తున్నాం' అని చెప్పారు జగదీశ్.

ఆలయ నిర్మాన సామగ్రి

Ayodhya temple design

2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మందిరం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉండనుంది. మూడు అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161గా ఉంటుంది. రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17 వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు.

2020 ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వేద మంత్రాల మధ్య ఆలయానికి పునాది రాయి వేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి.

ఇదీ చదవండి:'అమెరికా ఆస్పత్రి నుంచే కేరళ పాలన.. బైడెన్​లా చేయరట!'

ABOUT THE AUTHOR

...view details