తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోర్టు ఆదేశించినా.. నిందితుడిని వదిలేసిన పోలీసులు - కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ నిందితుడిని వదిలేసిన పోలీసులు

ఛత్తీస్​గఢ్​లో ఓ వ్యక్తికి జైలు శిక్ష విధించాలని అక్కడి న్యాయస్థానం ఆదేశించింది. అయితే.. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఓ ఇద్దరు కానిస్టేబుళ్లు ఆ నిందితుడిని విడుదల చేసి బయటకు పంపించారు. వారిపై అధికారులు చర్యలు చేపట్టారు.

Constables set accused free defying court's order in Chhattisgarh
కోర్టు ఆదేశించినా.. నిందితుడిని వదిలేసిన పోలీసులు

By

Published : Mar 7, 2021, 10:14 AM IST

ఓ అనూహ్య ఘటనతో ఇద్దరు పోలీసులు వార్తల్లో నిలిచారు. న్యాయస్థానం ఉత్తర్వులను ధిక్కరిస్తూ.. ఓ నిందితుడిని జైలు నుంచి విడుదల చేశారు. ఛత్తీస్​గఢ్​ జాంజ్​గిర్​-చంపా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ఇదీ జరిగింది..

సెక్షన్​ 151 కింద ఓ నిందితుడిని నైలా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని న్యాయస్థానం ముందు హాజరుపర్చగా... జైలు శిక్ష విధించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కానీ సునీల్​ సింగ్​, భూషణ్​ రాథోడ్​ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఆ నిందితుడిని విడిచిపెట్టారు.ఈ విషయాన్ని సబ్​ డివిజనల్​ పోలీస్​ అధికారి దినేశ్వరి నంద్​ తెలిపారు.

ఆ ఇద్దరు పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామన్న దినేశ్వరి నంద్.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'రాజకీయాలకు 'కస్టమ్స్​'ను వాడుకుంటున్నారు'

ABOUT THE AUTHOR

...view details