తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కానిస్టేబుల్​కు నిప్పంటించి హత్య చేసిన ప్రేయసి- వాంగ్మూలం మార్చి మరీ చనిపోయిన పోలీస్! - బెంగళూరులో పోలీస్​ను చంపిన మహిళ

Constable Set On Fire By Lover In Bengaluru : కానిస్టేబుల్​పై పెట్రోల్​ పోసి నిప్పంటించింది అతడి ప్రేయసి. తీవ్రంగా గాయపడిని బాధితుడు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. అయితే అప్పటికే ఆ మహిళకు వివాహం అయినట్లు తెలుస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది.

Constable Set On Fire By Lover In Bengaluru
Constable Set On Fire By Lover In Bengaluru

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 9:46 AM IST

Constable Set On Fire By Lover In Bengaluru :కానిస్టేబుల్​పై పెట్రోల్​ పోసి నిప్పంటించింది అతడి ప్రేయసి. తీవ్రంగా గాయాలైన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అయితే వేరొకరితో సంబంధం గురించి ప్రశ్నించినందుకు తన ప్రేయసే ఈ దారుణానికి పాల్పడిందని మృతుడు మరణానికి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. కర్ణాటకలోని బెంగుళూరులో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అసలు ఏం జరిగిందంటే?
2018 బ్యాచ్‌కు చెందిన సంజయ్ అనే వ్యక్తి బసవనగుడి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి నాలుగేళ్ల క్రితం హోంగార్డుగా పనిచేస్తున్న ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం కొన్ని నెలల తర్వాత హోంగార్డు ఉద్యోగం మానేసి ఓ ప్రైవేట్​ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేయడం మొదలుపెట్టింది. అయితే ఇదివరకే వివాహం అయిన ఆ మహిళను సంజయ్​ తరచూ కలుస్తుండేవాడు.

డిసెంబర్ 6న తనను​ ఆ మహిళ కలిసినట్లు సంజయ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. 'వారిద్దరు కలిసి ఉన్న క్రమంలో ఆమెకు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్​ వచ్చింది. దీంతో అనుమానం వచ్చి సంజయ్ ఫోన్​ను పరిశీలించగా ఓ వ్యక్తితో ఆమె మాట్లాడినట్లు రికార్డయ్యింది. ఈ విషయమై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని మరోసారి అడిగితే పెట్రోల్ పోసి నిప్పంటించుకుంటానని ఆమె సంజయ్​ను బెదిరించింది. ఆ తర్వాత వెళ్లి పెట్రోల్ తెచ్చి పోసి నిప్పంటించుకోమని సంజయ్​ సవాల్ విసిరాడు. ఆయితే ఆ మహిళ వెంటనే సంజయ్​పై పెట్రోల్​ పోసి నిప్పంటించింది' అని సంజయ్​ ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.

మంటల్లో తీవ్రంగా గాయపడిన సంజయ్ అదే రోజు ఆస్పత్రిలో చేరాడు. అయితే మొదట తాను వంట చేస్తుండగా మంటల చెలరేగడం వల్ల గాయపడ్డానని చెప్పాడు. ఆ తర్వాత వాంగ్మూలాన్ని తనపై ఓ మహిళ పెట్రోల్​ పోసి నిప్పంటించిందని తెలిపాడు. మరోవైపు మృతుడు సంజయ్ బంధువులు సైతం ఓ మహిళ అతడికి నిప్పంటించి హత్యచేసిందని ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉండగా నేరం జరిగిన ప్రదేశం ఆధారంగా పుట్టెనహళ్లి స్టేషన్‌కు కేసును బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బెంగళూరు సౌత్​ డివిజన్ డీసీపీ రాహుల్ కుమార్ షహాపుర్ స్పందించారు. బాధితుడికి తెలిసిన వారే ఈ ఘటనకు కారణమని, ప్రస్తుతం నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

కుక్క పేరు తెచ్చిన తంట.. మహిళ ఒంటికి నిప్పంటించి..

మహిళల ముందు అసభ్య ప్రవర్తన.. 'అవి' చూపించాడని రహస్య భాగాలపై పెట్రోల్ పోసి..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details