తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్యతో వివాహేతర సంబంధం, సీఐపై హత్యాయత్నానికి పాల్పడ్డ కానిస్టేబుల్ - మహబూబ్​నగర్​లో సీఐపై కానిస్టేబుల్ అటాక్

Constable Attack on CI in Mahabubnagar District : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ కానిస్టేబుల్​.. సీఐపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Constable Attack on CI
Constable Attack on CI In Mahabubnagar District

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 2:04 PM IST

Constable Attack on CI in Mahabubnagar District : వివాహేతర సంబంధంతో తమ జీవితాలతో పాటు కుటుంబాలను సైతం చీకట్లోకి నెట్టేస్తున్నారు. కొందరు ఇలాంటివి సహించలేక ఆత్మహత్యలకు దారి తీస్తే.. మరికొన్ని హత్యలు చేసే వరకు తీసుకెళ్తున్నాయి. ఎలాంటి స్థాయిలో ఉన్నామని మరచి.. ఇలాంటి చెడు అలవాట్లకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా.. ప్రజలకు సూచించాల్సిన పోలీసులే ఇలాంటి ఘటనలకు పాల్పడితే సామాన్య ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారని స్థానికులు వాపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన మహబూబ్​నగర్​ జిల్లాలో చోటుచేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి ఓ కానిస్టేబుల్​ సీఐపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. అతనిపై తీవ్రంగా దాడి చేసి.. సీఐ వచ్చిన కారులోనే అతడిని పట్టణ సమీపంలోని రోడ్డుపై వదిలి వెళ్లారు. ఉదయాన్నే బాధితుడిని గుర్తించిన స్థానికులు.. చికిత్స కోసం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Extra Marital Affair Murder Rangareddy : హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం.. ఏడుగురు అరెస్టు

Constable Attack on CCS CI: మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో సీసీఎస్​లో పని చేస్తున్న సీఐ ఇఫ్తికార్ అహ్మద్​పై హత్యాయత్నం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. బుధవారం అర్ధరాత్రి ఈ దాడి జరిగింది. స్థానికంగా ఓ పీఎస్​లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్​..సీఐని హత్య చేయడానికి ప్రయత్నించాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. సీఐ మర్మాంగాలను కోయడంతో పాటు తలపై బలమైన ఆయుధాలతో సీఐపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకున్న సీఐని అతను తీసుకొచ్చిన కారులోనే మహబూబ్​నగర్ పట్టణంలోని పాలకొండ బైపాస్ వద్ద వదిలివెళ్లారు.

Mother kills Daughter : వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని.. కన్న కూతురినే కడతేర్చిన కసాయి తల్లి

తెల్లవారుజామున గుర్తించిన స్థానికులు.. అతడిని తొలుత జిల్లా కేంద్రంలోని ఎస్​ఈఎస్​ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సీఐ ఇఫ్తికార్​ను హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సీఐ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిందితుడి భార్య కూడా కానిస్టేబుల్​గా పని చేస్తున్నారు. ఆమె మహబూబ్​నగర్​లోనే ఓ పీఎస్​లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జోగులాంబ జోన్​ డీఐజీ ఎల్​ఎస్​ చౌహాన్​, ఎస్పీ హర్షవర్ధన్​, అదనపు ఎస్పీ రాములు తదితరులు మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని ఎస్​ఈఎస్​ ఆసుపత్రికి వచ్చి సీఐ ఇఫ్తికార్​ అహ్మద్​ను పరామర్శించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్యాయత్నానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

సీఐ

నా భర్తని చంపెయ్.. నిన్ను పెళ్లి చేసుకుంటా..

తమ్ముడి వివాహేతర సంబంధానికి అన్నబలి

ABOUT THE AUTHOR

...view details