Farmers Protest Latest News: రైతుల సమస్యలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని డిమాండ్లపై కేంద్రం రూపొందించిన ముసాయిదాపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) వెల్లడించింది. ఈ మేరకు ఎస్కేఎం కోర్ కమిటీ సభ్యుడు గుర్నామ్ సింగ్ ఛడూని వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పలు అంశాలపై ఏకీభవిస్తున్నట్లు తెలిపిన ఆయన.. 'గురువారం సమావేశం అనంతరం ఆందోళన విరమించే విషయమై నిర్ణయం తీసుకుంటాం' అని స్పష్టం చేశారు.
Samyukta Kisan Morcha: అయితే 'ప్రభుత్వం రైతుల డిమాండ్లను నెరవేర్చాలి. రైతులపై 'నకిలీ' కేసుల ఉపసంహరణకు విధించిన షరతులు సహా.. ప్రభుత్వ ప్రతిపాదనలోని కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలి. బంతి ఇప్పుడు ప్రభుత్వ కోర్టులో ఉంది' అని మరో రైతు నేత యుధ్వీర్ సింగ్ తెలిపారు.