కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నాయకులు అహ్మద్ పటేల్, తురుణ్ గొగొయికి నివాళులు అర్పించింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ). వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతోపాటు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
"అహ్మద్ పటేల్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పార్టీ సంపదను కోల్పోయాము. నాలుగు దశాబ్దాలుగా పార్టీకి పటేల్ చేసిన సేవలు ప్రశంసనీయం. కాంగ్రెస్ అజెండానే తన అజెండాగా పనిచేశారు. పార్టీకి చేసిన కృషి వల్ల ఎంతో మంది అభిమానులు, స్నేహితులను పటేల్ సంపాదించుకున్నారు."
--అహ్మద్ పటేల్ మృతిపై సీడబ్ల్యూసీ.
అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయికి నాలుగు దశాబ్దాల పాటు చేసిన సేవలను కొనియాడింది సీడబ్ల్యూసీ.