కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఇప్పట్లో లేనట్లేనని పార్టీ వర్గాలు తెలిపాయి. 2022 సెప్టెంబరులో ఎన్నిక జరిగే అవకాశముందని పేర్కొన్నాయి.
'2022లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక' - సీడబ్ల్యూసీ భేటీ సోనియా గాంధీ న్యూస్
12:41 October 16
11:58 October 16
కాంగ్రెస్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని.. ఐక్యంగా ఉండి, పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వస్తాయని సోనియా గాంధీ అన్నారు.
11:35 October 16
పార్టీ నేతలు తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబితే తాను అభినందిస్తానని.. కానీ మీడియా ద్వారా తెలియజేయాల్సిన అవసరం లేదని సోనియా అన్నారు. ఈ రోజు అన్ని విషయాలపై స్పష్టత తీసుకారాల్సిన సందర్భమొచ్చిందని చెప్పారు. నిజాయతీగా అన్ని అంశాలపై చర్చిద్దామన్నారు.
లఖీంపుర్ ఖేరిలో జరిగిన ఘటనపై సీడబ్ల్యూసీ సమావేశంలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సోనియా. భాజపా నేతల మనస్తత్వానికి, రైతుల ఆందోళనలపై వారి ఆలోచనకు ఇది నిదర్శమన్నారు. విదేశాంగ విధానం, సరిహద్దులో పరిస్థితులపైనా సోనియా ఆందోళన వ్యక్తం చేశారు.
11:21 October 16
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఆలస్యం కావడానికి కరోనానే కారణమని ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. జూన్ 30 నాటికే కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకునేందుకు రోడ్ మ్యాప్ ఖరారు చేసినప్పటికీ కరోనా రెండో దశ వల్ల నిరవదిక వాయిదా పడిందని సీబ్ల్యూసీ సమావేశంలో చెప్పారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ పూర్వవైభవం కోరుకుంటున్నారని అందుకు నాయకులు ఐక్యంగా ఉండటం, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడం అవసరమన్నారు.
09:09 October 16
సీడబ్ల్యూసీ సమావేశం..
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశమైంది. పార్టీ సంస్థాగత ఎన్నికలతో పాటు, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పంజాబ్ పరిణామాలపై ఇటీవల జీ-23గా పేర్కొనే కాంగ్రెస్ అసమ్మతి వర్గానికి చెందిన పలువురు అధిష్ఠానంపై బహిరంగంగా విమర్శలు చేసిన అంశాలూ చర్చకు రానున్నాయి.
గతంలో సీడబ్ల్యూసీ భేటీ గురించి పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అధిష్ఠానానికి లేఖ రాశారు. ఈ క్రమంలో సీడబ్ల్యూసీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.