మరో వంద నెలల పట్టినా సాగు చట్టాల రద్దు కోసం రైతులతో కలసి పోరాడతామన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఏర్పాటు చేసిన కిసాన్ మహాపంచాయత్‌లో ఆమె పాల్గొన్నారు.
"100 రోజులు గడిచింది. నమ్మకం కోల్పోవద్దు. ప్రభుత్వం ఈ నల్ల చట్టాలు వెనక్కు తీసుకోవడానికి మరో 100 వారాలు లేదా 100 నెలలు పట్టినా మీతో పాటు మేం పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం."