తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మేము గెలిస్తే సాగు చట్టాలు రద్దు' - priyanka gandhi on farm laws

కిసాన్​ పంచాయత్​ కార్యక్రమంలో భాగంగా నూతన సాగు చట్టాలపై కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే చట్టాలను రద్దు చేస్తామన్నారు.

priyanka gandhi
సాగు చట్టాలపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు

By

Published : Feb 10, 2021, 4:55 PM IST

Updated : Feb 10, 2021, 5:46 PM IST

కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. ఉత్తర్​ప్రదేశ్​లోని సహరన్​పూర్​లో బుధవారం నిర్వహించిన కిసాన్​ పంచాయత్​ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

అవమానిస్తున్నారు..

ఈ చట్టాలు కేవలం కోటీశ్వరులకే మేలు చేస్తాయని.. వారే రైతుల పంట ఉత్పత్తికి ధరలు నిర్ణయిస్తారని ఆరోపించారు ప్రియాంక. చట్టాలు రద్దు చేసేవరకు కాంగ్రెస్​ పోరాడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. మోదీ సహా భాజపా నేతలు.. నిరసన తెలుపుతున్న రైతులను అవమానిస్తున్నారని అన్నారు.

సాగు చట్టాలపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
సాగు చట్టాలపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు

అంతా డ్రామా..

కిసాన్​ పంచాయత్​ కార్యక్రమంపై భాజపా నేతలు స్పందించారు. రైతుల పేరుతో నాటకం జరుతోందని ఉత్తర్​ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆనంద్​ స్వరూప్​ శుక్లా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులు అంతర్జాతీయ స్థాయిలో విమర్శలకు యత్నిస్తున్నాయని అన్నారు. రైతు ఉద్యమంపై ఇటీవల స్పందించిన పలువురు విదేశీ ప్రముఖలను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానిపై వ్యతిరేకత వ్యక్తం చేయవచ్చు కానీ.. దేశం మీద కాదన్నారు. కేవలం వార్తల్లో నిలవడం కోసమే పలువురు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి బ్రిజేష్​ పథక్​ అన్నారు.

ఇదీ చదవండి :'ఈ మాటలతో ఇక మహిళకు రక్షణ ఉంటుందా?'

Last Updated : Feb 10, 2021, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details