తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Petrol Hike: 'జూన్​ 11న దేశవ్యాప్తంగా నిరసనలు' - కాంగ్రెస్ ఆందోళన

పెట్రోల్​ ధరల పెంపునకు(Petrol Hike) వ్యతిరేకంగా.. కాంగ్రెస్​ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. జూన్​ 11న పెట్రోల్​ బంక్​ల ఎదుట కాంగ్రెస్​ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు.

congress protest on petrol price
పెట్రోల్​ ధర పెంపుపై కాంగ్రెస్​ ఆందోళన

By

Published : Jun 9, 2021, 9:57 AM IST

Updated : Jun 9, 2021, 10:51 AM IST

దేశంలో పెట్రోల్​ ధరల పెరుగుదలను(Petrol Hike) నిరసిస్తూ.. జూన్ 11న కాంగ్రెస్​ దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించనుంది. పెట్రోల్​ బంక్​ల వద్ద కాంగ్రెస్​ కార్యకర్తలు నిరసనను తెలపనున్నారు. పెట్రో ధరల పెంపుపై కేంద్రాన్ని కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ ఇప్పటికే పలుమార్లు విమర్శించారు.

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూ సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటర్​కు రూ.100 దాటగా.. మరిన్ని ప్రాంతాల్లో సెంచరీకి అడుగు దూరంలో ఉంది.

బుధవారం సైతం పెట్రోల్​ ధర మరో 19 పైసలు పెరిగింది. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.95.56కు చేరింది. డీజిల్​ ధర రూ.86.47కు ఎగబాకింది. ముంబయిలో ఇప్పటికే లీటరు పెట్రోల్​ ధర రూ.100 దాటింది. డీజిల్​ ధర రూ.93.85గా ఉంది.

ఇదీ చదవండి:ఆమెకు వ్యాక్సినేషన్‌ పూర్తయిన వరుడే కావాలట!

Last Updated : Jun 9, 2021, 10:51 AM IST

ABOUT THE AUTHOR

...view details