వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు(UP election 2022) జరగనున్న వేళ.. కాంగ్రెస్(Congress news) కీలక ప్రకటన చేసింది. 40 శాతం టికెట్లు మహిళలకే ఇవ్వనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ(UP election priyanka gandhi) స్పష్టం చేశారు.
''అధికారంలో మహిళలు పూర్తి స్థాయి భాగస్వామి కావాలని మేం కోరుకుంటున్నాం. మహిళల సాధికారత కోసమే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. దీని వెనుక రాజకీయ ఉద్దేశం, ఇతర అజెండాలు ఏమీ లేవు.''
- ప్రియాంకా గాంధీ వాద్రా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
రానున్న ఎన్నికల్లో గెలుపే తమ లక్ష్యమని, అందుకే మహిళలకు సింహభాగం కేటాయించినట్లు పేర్కొన్నారు ప్రియాంక. కులమతాల పట్టింపుల్లేకుండా.. మెరిట్ ప్రాతిపదికన సీట్లు దక్కుతాయని వెల్లడించారు. లఖ్నవూలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆమె(UP election priyanka gandhi).. భాజపాపై ఆరోపణలు గుప్పించారు.