దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతుగా జనవరి 15న దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. 'కిసాన్ అధికార్ దివస్' పేరిట గవర్నర్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర బాధ్యులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.
'కిసాన్ అధికార్ దివస్'లో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు.. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గైర్హాజరయ్యారు.