తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా, కాంగ్రెస్​ మధ్య 'టూల్​కిట్'​ రగడ - టూల్​కిట్​పై భాజపా

కాంగ్రెస్​ దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్రపన్నుతోందని భాజపా ఆరోపించింది. మహమ్మారి సమయంలో 'టూల్​కిట్'​ను రూపొందించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంది. దీనిపై కాంగ్రెస్​ తీవ్రంగా స్పందించింది.

కాంగ్రెస్​ టూల్​కిట్, congress toolkit
'మోదీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కాంగ్రెస్​ కుట్ర'

By

Published : May 18, 2021, 4:01 PM IST

భాజపా, కాంగ్రెస్​ మధ్య 'టూల్​కిట్'​ వివాదానికి దారితీసింది. కేంద్ర ప్రభుత్వ పాలనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్​ టూల్​కిట్​ రూపొందించిందని భాజపా నేతలు ఆరోపించారు. ఈ మేరకు పలు డాక్యుమెంట్లను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. భారత్​, ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు కాంగ్రెస్​ కుట్ర పన్నుతోందని భాజపా నేతలు దుయ్యబట్టారు.

ఇంతకీ వివాదం ఏంటి?

భాజపా ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కార్యకర్తలు చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ ఉన్న డాక్యుమెంట్లు సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూశాయి. కాంగ్రెస్​ గుర్తుతో ఉన్న ఆ పత్రాలను భాజపా ప్రతినిధి సంబిత్​ పాత్రా సహా పలువురు నేతలు తమ సోషల్​ మీడియాలో షేర్​ చేశారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్​ను కార్యకర్తలు 'ఇండియన్​ స్ట్రెయిన్'​ అని కాకుండా 'మోదీ స్ట్రెయిన్'​ అని పిలవాలని ఆ పత్రాల్లో ఉన్నట్లు భాజపా పేర్కొంది. వీటితో పాటు సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు, కొవిడ్​ మరణాలపైనా వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్నట్లు చెప్పింది భాజపా.

సంబిత్​ పాత్రా ట్వీట్​
రాహుల్​ను విమర్శిస్తూ సంబిత్ పాత్రా ట్వీట్

"రాజకీయ లబ్ధి కోసం విదేశీ జర్నలిస్టుల సాయంతో దేశ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కాంగ్రెస్​ ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఈ మహమ్మారిని రాహుల్​ గాంధీ ప్రధాని ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు అవకాశంగా భావిస్తున్నారు. కుంభమేళాను సూపర్​ స్ప్రెడర్​ కుంభ్​గా పిలవమని ఆ పార్టీ పేర్కొంది. కాంగ్రెస్​ అజెండా ఏంటో మీరే తెలుసుకోండి. "

-సంబిత్​ పాత్రా, భాజపా ప్రతినిధి

కాంగ్రెస్​ ఖండన

భాజపా ఆరోపణలను కాంగ్రెస్​ ఖండించింది. కొవిడ్​ కట్టడి వైఫల్యంపై భాజపా నకిలీ టూల్​కిట్​ను రూపొందించి, తమకు ఆపాదిస్తోందని కాంగ్రెస్​ ప్రతినిధి రాజీవ్​ గౌడ పేర్కొన్నారు. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ ఫోర్జరీకి పాల్పడినందుకు గానూ భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, సంబిత్​ పాత్రాపై ఎఫ్​ఐఆర్​ దాఖలు చేస్తామని తెలిపారు. దేశమంతా కొవిడ్​తో అతలాకుతులం అవుతుంటే భాజపా మాత్రం ఫోర్జరీలకు పాల్పడుతోందని ఆరోపించారు.

ఇదీ చదవండి :'చిన్నారుల కోసమైనా మోదీ ప్రభుత్వం నిద్రలేవాలి'

ABOUT THE AUTHOR

...view details