సాగు చట్టాలపై కేంద్రంతో జరిపిన చర్చలు కొలిక్కి రాకపోవటం వల్ల ఈనెల 8న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. ఈ నేపథ్యంలో బంద్కు విపక్ష, భాజపా భాగస్వామ్యేతర ప్రాంతీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా కాంగ్రెస్ కూడా భారత్ బంద్కు మద్దతు ప్రకటించింది.
" డిసెంబర్ 8న జరగబోయే భారత్ బంద్కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న మా పార్టీ కార్యాలయ్యాల్లో ఆందోళనలు చేపడతాం. ఇది రైతుల పట్ల రాహుల్ గాంధీ మద్దతును మరింత బలోపేతం చేస్తుంది. దేశవ్యాప్త బంద్ విజయవంతమవుతుందని భరోసా ఇస్తున్నాం."