రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ అసమ్మతి స్వరం వినిపిస్తోందనే వార్తలు ఊపందుకున్నాయి. జితిన్ ప్రసాద కాంగ్రెస్‌నుంచి భాజపాలో చేరిన వెంటనే సచిన్ పైలట్ పార్టీ మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ వార్తలను ఇప్పటికే కొట్టిపారేశారు సచిన్ పైలట్. ఈ క్రమంలో అధిష్టానానికి కీలక సూచనలు చేశారు ఆయన వర్గీయులు. పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించినట్టు గానే రాజస్థాన్‌లో సచిన్ పైలట్, అశోక్ గహ్లోత్ మధ్య ఉన్న విభేదాలను అధిష్టానం పరిష్కరించాలని కోరారు.
సచిన్ పైలట్ కాంగ్రెస్‌తోనే ఉంటారని, అధిష్టానం అప్పగించిన అన్ని పనులను పూర్తి చేస్తారని తెలిపారు ఆయన మద్దతుదారులు. సచిన్ తరుచుగా పార్టీ హైకమాండ్‌తో టచ్‌లో ఉంటున్నారని, ఆయన డిమాండ్లు తర్వలోనే పరిష్కారమవుతాయనే నమ్మకం ఉన్నట్లు స్పష్టం చేశారు.