మహాకూటమిలో సీట్ల పంపకం ఇంకా మెరుగ్గా జరిగి ఉంటే ఫలితాలు తమ కూటమికి అనుకూలంగా వచ్చేవని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా అన్నారు. "ఎన్డీఏకు మాకు మధ్య తేడా చాలా స్వల్పంగా ఉండేది" అని ఈటీవీ భారత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఎన్నికల్లో వామపక్షాలు మంచి పోటీ ఇచ్చాయన్నారు. సీపీఐ, సీపీఎం, సీపీఐ-ఎంఎల్ సహా వామపక్షాలు ఈ ఎన్నికల్లో 29 స్థానాల్లో మహా కూటమిలో భాగంగా పోటీ చేశాయి. సీపీఐ-ఎంఎల్ 12 స్థానాలు, సీపీఐ, సీపీఎం రెండు స్థానాల చొప్పున గెల్చుకున్నాయి. భాజపా తర్వాత సీపీఐ-ఎంఎల్ విజయశాతం 63.2. ఈ పార్టీ 19 స్థానాల్లో పోటీ చేయగా 12 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ మంచి పనితీరు కనబర్చలేకపోయింది. ఆ పార్టీ విజయ శాతం 27.1 మాత్రమే. 70 స్థానాల్లో పోటీ చేయగా 19 స్థానాల్లో మాత్రమే గెల్చింది.
'బిహార్ తీర్పుతో కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి' - Maha Grand Alliance news
బిహార్ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా. ఫలితాలపై కాంగ్రెస్ తీవ్రంగా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు రాజా. మహాకూటమిలో సీట్ల పంపకం ఇంకా మెరుగ్గా జరిగి ఉంటే ఫలితాలు తమ కూటమికి అనుకూలంగా వచ్చేవని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా అభిప్రాయపడ్డారు.
"ఈ ఫలితాలపై కాంగ్రెస్ తీవ్రంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆర్జేడీ, ఇతరులు కూడా ఫలితాలపై అంతర్మథనం చేసుకోవాలి" అని రాజా అన్నారు. రెండు కూటముల మధ్య ఓట్ల తేడా 0.03శాతం మాత్రమేనన్నారు. ఎన్డీఏ, భాజపా ఓటర్లలో చీలిక తేవాలనుకున్నాయని, సమాజంలో ప్రత్యేకించి ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించారు. 'ఎన్డీఏ వాస్తవంగా ఏ ఒక్క అంశం ఆధారంగానూ ఈ ఎన్నికల్లో పోరాడలేదు. నరేంద్రమోదీ వల్లే ఈ ఎన్నికల్లో గెలిచామన్న భాజపా వాదన తప్పు' అని అన్నారు. బిహార్ ఎన్నికల ప్రభావం రాబోయే ఎన్నికలపైనా ఉంటుందన్నారు.