2019 నాటి పరువునష్టం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై గుజరాత్‌లోని సూరత్‌లో విచారణ జరిగింది. నాటి ప్రసంగం గురించి కోర్టు రాహుల్‌ని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన రాహుల్.. వ్యక్తిగతంగా తనకు ఆ అంశం గురించి అంతగా అవగాహన లేదని కోర్టుకు తెలిపారు.
తమ తరఫున ఇద్దరు సాక్షులు ఉన్నారని రాహుల్ గాంధీ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే వారిద్దరూ ప్రభుత్వ ఉద్యోగలైనందున వారిని హాజరుపరచాలన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించనుంది రాహుల్ బృందం. ఒకవేళ హైకోర్టు తమ అభ్యర్థనను అంగీకరిస్తే.. ఫిర్యాదుదారుడి సహా.. రాహుల్ మరోసారి కోర్టుకు రావాల్సి ఉంటుంది. ఈ కేసులో జూలై 12న తదుపరి విచారణ జరగనుంది.
రాహుల్ తుది వాంగ్మూలం నమోదు చేసేందుకు జూన్ 24న కోర్టుకు హాజరుకావాల్సిందిగా సూరత్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గతవారం ఆదేశించారు.
ఇదీ కేసు..