తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అయోధ్య గుడి విరాళాల లెక్క చెప్పండి' - ఛత్తీస్​గఢ్​ వార్తలు

అయోధ్యలో రామ మందిర నిర్మాణం విరాళాల సేకరణ విషయంలో ఛత్తీస్​గఢ్​ సీఎం భూపేష్​ బఘేల్​, భాజపా ఎమ్మెల్యే బ్రజ్​మోహన్​ అగర్వాల్​ మధ్య మాటల యుద్ధం జరిగింది. రామాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.101 కోట్లను విరాళంగా ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేయగా.. ఇంతవరకు ఎంత సొమ్ము పోగైందో లెక్కలు చెప్పాలన్నారు ముఖ్యమంత్రి.

Congress seeks account of Ram temple donations
'రామాలయ నిర్మాణానికి పోగైన విరాళాల లెక్కచెప్పండి?'

By

Published : Dec 7, 2020, 3:56 PM IST

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సేకరించిన విరాళాల లెక్కలు చెప్పాలని భాజపాను డిమాండ్ చేశారు ఛత్తీస్​గఢ్​ సీఎం భూపేష్ బఘేల్​. రామాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.101 కోట్లు ఇవ్వాలని భాజపా ఎమ్మెల్యే బ్రజ్​మోహన్​ అగర్వాల్​ కోరిన నేపథ్యంలో.. ఈ మేరకు స్పందించారు బఘేల్​. 1992 నుంచి ఇప్పటివరకు ఎన్ని నిధులు సేకరించారో చెప్పాలని ప్రశ్నించారు.

బఘేల్​ వ్యాఖ్యలపై అంతే తీవ్రంగా స్పందించారు బ్రజ్​మోహన్​. ఈ నిధుల విషయంలో కాంగ్రెస్​ ఎలాంటి సహకారం అందించలేదని, ఆ పార్టీకి లెక్కల గురించి మాట్లాడే హక్కులేదన్నారు. అయితే.. తాము కోరినట్టు నిధుల్ని సమకూరిస్తే.. సంబంధిత లెక్కలన్నింటినీ వివరించేందుకు తాము సిద్ధమని చెప్పారు అగర్వాల్​.

ఇదీ చదవండి:'అంబానీ-అదానీ చట్టాల్ని రద్దు చేయాలి'

ABOUT THE AUTHOR

...view details