తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం, బంగాల్​ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా - అసోం అసెంబ్లీ ఎన్నికలు

అసోం అసెంబ్లీ ఎన్నికలకు 40మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది కాంగ్రెస్. ఆ రాష్ట పార్టీ అధ్యక్షుడు రిపున్‌ బోరా.. గోహ్‌పూర్‌ స్ధానం నుంచి పోటీ చేయనున్నారు. బంగాల్​లో 13 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసింది హస్తం పార్టీ.

Congress releases lists for Assam, bengal Assembly elections
అసోం, బంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన

By

Published : Mar 7, 2021, 5:12 AM IST

బంగాల్, అసోం శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. అసోంలో 40 స్ధానాలకు, బంగాల్‌లో 13 స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. అసోం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రిపున్‌ బోరా.. గోహ్‌పూర్‌ స్ధానం నుంచి పోటీ చేయనున్నారు. అసోంలో కాంగ్రెస్‌, వామపక్షాలు, పలు బోడోలాండ్‌ పార్టీలతో కలిసి పోటీ చేస్తోంది.

అసోంలో 2001నుంచి 2016 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్​ గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. 126 స్థానాలకు గానూ 26 సీట్లకు పరిమితమైంది. ఈసారి వామపక్షాలు, బోడోలాండ్ పార్టీలతో కలిసి మహా కూటమిగా బరిలోకి దిగుతోంది. అసోంలో మార్చి 27, ఏప్రిల్​ 1, ఏప్రిల్ 6 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

అటు బంగాల్‌లో వామపక్షాలతో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ 13 స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. బంగాల్‌లో 294 స్ధానాలు ఉండగా, పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీకి 92 సీట్లు దక్కాయి.

ఇదీ చూడండి: కౌన్‌ బనేగా బంగాల్​ టైగర్‌?

ABOUT THE AUTHOR

...view details