తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఫ్రీ టీకా, నీట్ రద్దు, గృహిణులకు రూ.1000'

పుదుచ్చేరిలో తాము అధికారంలోకి వస్తే ప్రజలకు కరోనా టీకా ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అలాగే నీట్​ పరీక్ష రద్దు, గృహిణులకు రూ.1000 వంటి పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ.. పుదుచ్చేరిలో ఈ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు.

Congress Puducherry manifesto, congress news
కాంగ్రెస్ మేనిఫెస్టో

By

Published : Mar 28, 2021, 5:07 PM IST

పుదుచ్చేరి ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌, నీట్‌ పరీక్ష రద్దు, నూతన విద్యా విధానం, గృహిణులకు రూ.1000 సాయం, మూతపడిన మిల్స్‌ను తిరిగి తెరవడం, అమరవీరుల కుటుంబ సభ్యులకు పింఛను పెంపు వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపర్చింది.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ పుదుచ్చేరిలో ఈ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించడం, పుదుచ్చేరి విశ్వవిద్యాలయంలో స్థానిక విద్యార్థులకు ప్రతి కో‌ర్సులో 25 శాతం కోటా, అన్ని ఇళ్లకు ఉచిత మంచి నీటి సరఫరా, వితంతువులు, నిరాశ్రయులైన మహిళలకు పింఛను రూ.5 వేలకు పెంపు వంటి హామీలతో మేనిఫెస్టో రూపొందించారు.

ఇదీ చూడండి:'అవినీతి బయటపడొద్దని మోదీకి తలవంచిన సీఎం'

ABOUT THE AUTHOR

...view details