తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆస్పత్రి నుంచి సోనియా డిశ్చార్జ్​.. మరికొన్ని రోజులు విశ్రాంతి!

Sonia discharge: కొవిడ్ అనంతర సమస్యలతో ఈనెల 12న ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ డిశ్చార్జ్ అయ్యారు. ఆమెను కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని కాంగ్రెస్ మీడియా వ్యవహారాల ఇంచార్జ్ జైరామ్ రమేష్ తెలిపారు.

Sonia Gandhi
ఆస్పత్రి నుంచి సోనియా డిశ్ఛార్జ్​

By

Published : Jun 20, 2022, 6:53 PM IST

Updated : Jun 20, 2022, 7:33 PM IST

Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాంగ్రెస్ మీడియా వ్యవహారాల ఇంచార్జ్ జైరామ్ రమేష్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోనియారు కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు చెప్పారు. కొవిడ్ అనంతరం వచ్చిన ఆరోగ్య సమస్యలతో 9 రోజుల పాటు సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు సోనియా. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు నుండి రక్తస్రావం కాగా.. ఈనెల 12న సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. కొవిడ్ అనంతర అనారోగ్య సమస్యలతో పాటు శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం కూడా చికిత్స తీసుకున్నారు.

నెషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా, రాహుల్​కు ఈడీ కొద్ది రోజుల క్రితం సమన్లు జారీ చేసింది. కరోనా వల్ల సోనియా ఈ విచారణకు హాజరుకాలేనని చెప్పారు. దీంతో జూన్​ 23న విచారణకు హాజరయ్యేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. రాహుల్ గాంధీ మాత్రం సోమవారంతో కలిపి మొత్తం నాలుగు రోజులు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సోనియా, రాహుల్​ గాంధీని కావాలనే లక్ష్యంగా చేసుకున్నారని ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు చేపట్టాయి.

ఇదీ చదవండి:విపక్షాలకు మరో షాక్​.. రాష్ట్రపతి రేసుకు గోపాలకృష్ణ గాంధీ విముఖత

Last Updated : Jun 20, 2022, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details