తెలంగాణ

telangana

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికకు సన్నాహాలు, మూడు రోజుల్లో షెడ్యూల్​

By

Published : Aug 23, 2022, 7:21 AM IST

Congress President Election కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ మూడు, నాలుగు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ​ వర్గాలు తెలిపాయి. సెప్టెంబరు 20వ తేదీ కల్లా కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేలా షెడ్యూల్‌ను రూపొందించినట్లు పేర్కొన్నాయి. మరోవైపు కాంగ్రెస్​ అధ్యక్ష బాధ్యతలను రాహుల్​ నిరాకరిస్తే దేశవ్యాప్తంగా కార్యకర్తలు నిరాశకు లోనవుతారని రాజస్థాన్​ సీఎం అన్నారు.

Congress president election schedule
Congress president election schedule

Congress President Election: కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ మూడు, నాలుగు రోజుల్లో వెలువడే అ అవకాశం ఉంది. వచ్చే నెల 20 నాటికల్లా నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేలా షెడ్యూల్‌ను రూపొందించినట్లు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తెలిపింది. అయితే.. తుది తేదీలను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆమోదించాల్సి ఉందని కమిటీ ఛైర్మన్‌ మధుసూధన్‌ మిస్త్రీ పేర్కొన్నారు.

రాహుల్​ ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సిద్ధం..
కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టాలని తాము కోరుకుంటున్నట్లు రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ వ్యాఖ్యానించారు. రాహుల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొనేందుకు పార్టీ నేతలంతా సానుకూలంగా ఉన్నారని వివరించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాలని రాహుల్‌ గాంధీకి ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకవేళ రాహుల్​ నిరాకరిస్తే కార్యకర్తలు అసంతృప్తికి లోనవుతారని చెప్పారు.

సందిగ్ధంలో రాహుల్‌, అధ్యక్ష పదవిపై నో క్లారిటీ
కాంగ్రెస్‌ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పార్టీపరంగా ఏర్పాట్లు పూర్తవుతున్నా దానిని చేపట్టేందుకు అగ్రనేత రాహుల్‌గాంధీ ఈసారి ముందుకు వస్తారా లేదా అనేది చర్చనీయాంశమైంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వరుసగా రెండుసార్లు ఓటమి చెందాక పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ 2019లో రాజీనామా చేశారు. నేతల ఒత్తిడితో ఆ బాధ్యతను సోనియాగాంధీ మరోసారి స్వీకరించారు. మధ్యలో సీనియర్‌ నేతలు అసమ్మతి గళం వినిపించినప్పుడు రాజీనామా చేసేందుకు ఆమె సిద్ధపడినా సీడబ్ల్యూసీ విన్నపం మేరకు కొనసాగుతున్నారు. పార్టీలో అత్యధికులు రాహుల్‌నే మరోసారి అధ్యక్షుడిగా కోరుకుంటున్నారని, మునుపటి నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లుగా ఆయన నుంచి ఎలాంటి సంకేతాలు రావట్లేదని సీనియర్‌ నాయకుడొకరు తెలిపారు.

సోనియాకు సహాయంగా కార్యనిర్వాహక అధ్యక్షులు!
రాహుల్‌ కాకపోతే సోనియా గాంధీనే అధ్యక్ష పదవిలో కొనసాగాలని మరికొందరు కోరుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పార్టీ రోజువారీ కార్యకలాపాల్లో సహాయం చేయడానికి కార్యనిర్వాహక అధ్యక్షుల హోదాతో ఒకరిద్దరు సీనియర్‌ నాయకులకు బాధ్యత అప్పగించాలని వారు సూచిస్తున్నారు. దేశంలో ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఇలాంటి తరుణంలో సోనియా, రాహుల్‌లలో ఎవరో ఒకరు అధ్యక్ష పదవిలో కొనసాగితే వారిని ఇరుకున పెట్టడం అధికార పార్టీకి కష్టమవుతుందని వారు అంటున్నారు.

ఇవీ చదవండి:చుట్టంగా వచ్చి ముగ్గురిని కిరాతకంగా చంపి వ్యక్తి, ఆపై రక్తపు మడుగులో కూర్చొని

ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం, గొంతు కోసి, ముఖం ఛిద్రం చేసి హత్య

ABOUT THE AUTHOR

...view details