Congress President Election : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 65 పోలింగ్ బూత్‌లలో ఎన్నికలు జరుగుతున్నాయి. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నికల జరగడం ఇది ఆరోసారి. 9 వేల మందికిపైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ ఉన్నారు. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కర్ణాటకలోని బళ్లారిలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు చిదంబరం, జైరాం రమేశ్, పార్టీ సీనియర్ నేత సుబ్బిరామిరెడ్డి.. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేశారు. మరోవైపు, అధ్యక్ష బరిలో ఉన్న మల్లిఖార్జున ఖర్గే.. బెంగళూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.