నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ వైఫల్యానికి కారణమేంటో సమీక్షించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ అన్నారు.
"ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విఫలమైంది. అసోం, కేరళలో పరాభవం చవిచూసింది. బంగాల్లో ఒక్క స్థానం సంపాదించలేకపోయింది."
--కపిల్ సిబాల్, కాంగ్రెస్ సీనియర్ నేత.