తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇండియా' కూటమి సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్​ బ్లూప్రింట్​! అన్ని రాష్ట్రాల నేతలతో కమిటీ భేటీ - ఇండియా కూటమి లేటెస్ట్ న్యూస్

Congress Panel on India Alliance : విపక్ష ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిటీ అన్ని రాష్ట్రాల నేతలతో సమావేశం కానుంది. డిసెంబర్​ 30, 31 తేదీల్లో భేటీ అయి ఓ బ్లూప్రింట్​ను తయారు చేసి ఇవ్వనుంది.

congress 2024 elections
congress 2024 elections

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 10:07 PM IST

Congress Panel on India Alliance : 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్ష కూటమి ఇండియా సిద్ధమైంది. కూటమికి ముఖ్యమైన సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు కాంగ్రెస్​ ఏర్పాటు చేసిన కమిటీ డిసెంబర్​ 30, 31 తేదీల్లో సమావేశం కానుంది. అన్ని రాష్ట్రాల నేతలతో చర్చించిన అనంతరం కాంగ్రెస్​ కమిటీ ఓ బ్లూ ప్రింట్​ను తయారు చేసి విపక్ష కూటమి ముందు ఉంచనుంది. ఇటీవల ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఇందులో మాజీ ముఖ్యమంత్రులు అశోక్​ గహ్లోత్​, భూపేశ్​ బఘేల్, సీనియర్​ నేతలు సల్మాన్​ ఖుర్షీద్​, ముకుల్​ వాస్నిక్​, మోహన్​ ప్రకాశ్​ ఉన్నారు. ఈ కమిటీ అన్ని రాష్ట్రాల ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్​పీ నేతలతో రెండు రోజుల్లో సమావేశం కానుంది. విపక్షాలతో సీట్ల సర్దుబాటుతో పాటు సార్వత్రిక ఎన్నికల సన్నద్దతపై కూడా నేతలతో చర్చించనుంది. ముఖ్యంగా ఉత్తర్​ప్రదేశ్​(80), మహారాష్ట్ర (48), బంగాల్​ (42), బిహార్​(40), తమిళనాడు (39), గుజరాత్​ (26), ఝార్ఖండ్​ (14), అసోం(14), పంజాబ్​ (13), దిల్లీ(7), జమ్ము కశ్మీర్(6) రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

"బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలతో కలిసి ఉమ్మడిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధంగా ఉంది. మిత్ర పక్షాలతో ఎలాంటి సమస్యలు లేవు. సీట్ల సర్దుబాటుతో పాటు వివిధ అంశాలపై చర్చిస్తాం. సీట్ల సర్దుబాటు సామరస్యంగానే జరుగుతుంది. ఉత్తర్​ప్రదేశ్​లో ముఖ్యమైన ఎస్​పీ, ఆర్​ఎల్​డీ ఇప్పటికే కూటమిలో ఉన్నాయి. త్వరలో బీఎస్​పీ కూడా చేరుతుంది. ఫలితంగా యూపీలో అన్ని పార్టీలు కలిపి బీజేపీని ఓడిస్తాయి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే 2024 ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ చర్చించేందుకు ఇష్టపడని ప్రజా సమస్యలైన నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాలపైనే విపక్ష కూటమి దృష్టి సారించనుంది. ఝార్ఖండ్​లో కూడా సీట్ల సర్దుబాటుపై ఎలాంటి సమస్య ఉండదు. JMM, RJDతో కూడిన కూటమే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ప్రశాంతంగానే సీట్లు సర్దుబాటు జరుగుతుంది."
--అవినాశ్​ పాండే, ఉత్తర్​ప్రదేశ్​ ఏఐసీసీ ఇంఛార్జ్​

"కూటమి పక్షాలైన జేడీయూ, ఆర్​జేడీ, కాంగ్రెస్​, వామపక్షాల ప్రభుత్వమే బిహార్​లో ఉంది. కాబట్టి సీట్ల సర్దుబాటు సామరస్యంగానే జరుగుతుంది. కమిటీ సభ్యుడైన మోహన్​ ప్రకాశ్​ బిహార్ ఇంఛార్జ్​ కావడం వల్ల ఆయన నీతీశ్​, లాలూ ప్రసాద్​తో మాట్లాడి ప్రశాంతంగా సీట్ల సర్దుబాటు జరిగేలా చూస్తారు."
--అజయ్​ కపూర్​, ఏఐసీసీ కార్యదర్శి

"మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటు పెద్ద సమస్య కాదు. శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్​ కూటమి 2019 నుంచి 2022 వరకు అధికారంలో ఉంది. బీజేపీ శివసేన, ఎన్​సీపీని కూల్చడం వల్ల ప్రభుత్వం కూలిపోయింది. ఎమ్మెల్యేలు వారితో ఉన్న ప్రజలు ఉద్ధవ్​ ఠాక్రే, శరద్ పవార్​తోనే ఉన్నారు."
--ఆశిశ్​ దువా, మహారాష్ట్ర ఇంఛార్జ్​

జనవరి రెండో వారంలోగా సీట్ల పంపకం ఖరారు!
జనవరి రెండో వారంలోగా ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలను ఖరారు చేయాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఇటీవల దిల్లీలో నాలుగో సారి విపక్ష కూటమి ఇండియా సమావేశమైంది. ఈ భేటీలో బీజేపీని ఓడించే వ్యూహాలపై చర్చించింది. ఆ తర్వాత కాంగ్రెస్​ అత్యున్నత విధాయక మండలి సీడబ్యూసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో సీట్ల సర్దుబాటుకు కమిటీ ఏర్పాటుతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై నేతలు తీవ్రంగా చర్చించారు.

ఇండియా కూటమి కీలక సమావేశం- మోదీని గద్దెదించడమే లక్ష్యంగా వ్యూహాలు, సీట్ల సర్దుబాటుపై చర్చ

ప్రధాని అభ్యర్థిగా ఖర్గే! జనవరిలో సీట్ల సర్దుబాటు- ఇండియా కూటమి భేటీలో నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details