Congress news: పార్టీ బలోపేతమే లక్ష్యంగా పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. వివిధ అంశాలపై పార్టీ నేతలు సమాంతరంగా పని చేసేలా మూడు గ్రూపులను ఏర్పాటు చేశారు. రాజకీయ వ్యవహారాలకు ఓ గ్రూప్, పార్టీ సంస్కరణలపై ఇటీవల చింతన్‌శిబిర్‌లో తీసుకున్న 'నవసంకల్ప్' నిర్ణయం అమలుకు ఓ బృందాన్ని, 'భారత్ జోడో యాత్ర' బాధ్యతలు మరో బృందానికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ బృందాల్లో సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా జీ-23 నాయకులు కూడా ఉన్నారు.
కాంగ్రెస్ కోసం 'టాస్క్‌ఫోర్స్'.. మూడు బృందాలతో ఎన్నికలకు రెడీ! - కాంగ్రెస్ వార్తలు తాజా
Congress news: 2024 ఎన్నికల ముందు దేశంలో మళ్లీ పట్టుసాధించేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్.. అందుకు అవసరమైన కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మూడు బృందాలను ఏర్పాటు చేశారు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. జీ-23 నేతలు సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు వీటిలో సభ్యులుగా ఉన్నారు.
సోనియా ఆధ్వర్యంలోని పార్టీ వ్యవహారాల బృందంలో రాహుల్ సహా జీ23 నేతలైన గులామ్ నబీ ఆజాద్, ఆనంద్ శర్మ ఉన్నారు. వీరితో పాటు మల్లికార్జున ఖర్గే, అంబికా సోనీ, దిగ్విజయ సింగ్, కేసీ వేణుగోపాల్, జితేంద్ర సింగ్ బృందంలో భాగం. టాస్క్‌ఫోర్స్-2024 పేరుతో 'నవసంకల్ప్' కోసం ఏర్పాటు చేసిన బృందంలో సీనియర్ నేతలు పి.చిదంబరం, ప్రియాంక గాంధీ వాద్రా సహా ముకుల్ వాస్నిక్, జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్, అజయ్ మేకన్, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, సునీల్ కనుగోలు సభ్యులుగా ఉన్నారు. ఇక భారత్ జోడో యాత్ర కోసం ఏర్పాటు చేసిన సెంట్రల్ ప్లానింగ్ గ్రూప్‌లో.. సచిన్ పైలట్, దిగ్విజయ సింగ్, శశిథరూర్, రవ్నీత్ సింగ్ బిట్టు, కేసీ జార్జ్, జోతిమణి, ప్రద్యుత్ బోర్దోలోయ్, జితు పట్వారీ సహా సలీమ్ అహ్మద్ ఉన్నారు. 'భారత్ జోడో యాత్ర'లో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నేతలు పర్యటించనున్నారు. గాంధీ జయంచి సందర్భంగా ఈ యాత్రను ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది.
ఇదీ చూడండి :'కొత్త మంత్రి'పై సీఎం వేటు.. వెంటనే అరెస్ట్.. అసలేం జరిగింది?