తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం - శశి థరూర్​ ప్ఱాన్స్​ అత్యున్నత పురస్కారం

Congress MP Shashi Tharoor: కాంగ్రెస్​ సీనియర్​ నేత, ఎంపీ శశి థరూర్​కు ఫ్రాన్స్​ అత్యున్నత పౌర పురస్కారం వరించింది. థరూర్​ రచనలు, ప్రసంగాలను గౌరవిస్తూ ఈ అవార్డును ప్రకటించినట్లు ఫ్రాన్స్​ రాయబారి తెలిపారు.

sasi tharuar award
sasi tharuar award

By

Published : Aug 12, 2022, 6:56 AM IST

MP Shashi Tharoor France Honour: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ను ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం 'షువలియె డి లా లిజియన్‌ హానర్‌' వరించింది. థరూర్‌ రచనలు, ప్రసంగాలను గౌరవిస్తూ ఈ అవార్డును ప్రకటించినట్లు భారత్‌లో ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మాన్యుయేల్‌ లెనియన్‌ తెలిపారు. తనకు పురస్కారం దక్కడంపై థరూర్‌ హర్షం వ్యక్తం చేశారు.

"ఫ్రాన్స్‌తో సంబంధాలను సమర్థించే, భాషను ప్రేమించే, సంస్కృతిని ఆరాధించే వ్యక్తిగా.. ఈ అవార్డు పొందడాన్ని గౌరవంగా భావిస్తున్నా. నన్ను దీనికి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు" అని ఆయన పేర్కొన్నారు. అవార్డు వరించిన నేపథ్యంలో థరూర్‌కు లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి సహా పలువురు హస్తం పార్టీ నేతలు అభినందనలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details