తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వరికి రూ.3200 మద్దతు ధర, గ్యాస్ సిలిండర్​పై రూ.500 సబ్సిడీ, పంట రుణాలు మాఫీ, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ​' - chhattisgarh congress latest news

Congress Manifesto in Chhattisgarh 2023 : ఛత్తీస్​గఢ్​ రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించింది అధికార కాంగ్రెస్​. అధికారంలోకి వస్తే క్వింటాల్ వరి మద్దతు ధరను రూ.3,200 చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్​ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​.

Congress Manifesto in Chhattisgarh 2023
Congress Manifesto in Chhattisgarh 2023

By PTI

Published : Nov 5, 2023, 3:34 PM IST

Updated : Nov 5, 2023, 4:00 PM IST

Congress Manifesto in Chhattisgarh 2023 : ఛత్తీస్​గఢ్​లో అధికారంలోకి వస్తే వరికి మద్దతు ధరను క్వింటాలుకు రూ.3,200 చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్​. దీంతో పాటు రైతులకు పంట రుణాలను మాఫీ చేస్తామని హామి ఇచ్చింది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​తో పాటు గ్యాస్ సిలిండర్​పై రూ.500 సబ్సిడీ ఇస్తామని చెప్పింది. బస్తా తునికి ఆకుకు రూ.6,000 చెల్లిస్తామని.. ఈ ఆకులను సేకరించే వారికి వార్షిక బోనస్​గా రూ.4000 ఇస్తామని చెప్పింది. ఈ మేరకు కాంగ్రెస్​ ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​. భరోసా కా ఘోషణ పత్ర 2023-28 పేరిట ఆరు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల మేనిఫెస్టోను వెలువరించింది కాంగ్రెస్​. తొలి దశ ఎన్నికల ప్రచార గడువు ముగియడానికి కొద్ది సేపటి ముందే మేనిఫెస్టోను విడుదల చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా కులగణన
రాజ్​నందగావ్​లో మేనిఫెస్టోను విడుదల చేసిన ముఖ్యమంత్రి బఘేల్​.. రాష్ట్రంలో కులగణను చేపడతామని చెప్పారు. ఎస్​సీ, ఎస్​టీ, బీసీ, మైనారిటీ, జనరల్​ అన్ని వర్గాల ప్రజల గణనను చేపడతామన్నారు. వీటి ద్వారా కేవలం రాజకీయ ప్రయోజనాలే కాకుండా బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. వీరి సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తామని వెల్లడించారు. మహత్రా న్యాయ్​ యోజన కింద రాష్ట్రంలోని మహిళలందరికీ గ్యాస్ సిలిండర్​పై రూ.500 రాయితీ ఇస్తామని చెప్పారు. సబ్సిడీ సొమ్మును మహిళ బ్యాంక్ ఖాతాల్లో నేరుగా వేస్తామని తెలిపారు. వీటితో పాటు ఇప్పటి వరకు అమల్లో ఉన్న అన్ని పథకాలను కొనసాగిస్తామన్నారు.

Chhattisgarh Assembly Election 2023 : ఛత్తీస్​గఢ్​లో నవంబర్​ 7, 17న రెండు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అంతకుముందు 2018లో జరిగిన ఛత్తీస్​గఢ్​ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 90 స్థానాలకు గాను 68 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 15 సీట్లతో ప్రతిపక్షానికే పరిమితమైంది. జనతా కాంగ్రెస్ ఛత్తీస్​గఢ్​ 5 సీట్లు, బీఎస్​పీ 2 స్థానాల్లో విజయం సాధించింది.

ఎన్నికల వేళ మావోయిస్టుల దారుణం- ప్రచారానికి వెళ్లిన బీజేపీ నేత హత్య

'రూ.500కే గ్యాస్​ సిలిండర్​, రెండేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.10వేలు'

Last Updated : Nov 5, 2023, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details