తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్​ గెలిస్తే మహిళలకు నెలకు రూ.1100, లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు!' - పంజాబ్​ పోల్స్​ కాంగ్రెస్​

Congress Manifesto for Punjab polls: పంజాబ్​లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. కాంగ్రెస్​ మేనిఫెస్టో విడుదల చేసింది. లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనున్నట్లు హామీ ఇచ్చింది. మహిళలకు నెలనెలా రూ. 1100 చొప్పున సాయం అందించనున్నట్లు పేర్కొంది.

Congress Manifesto for Punjab polls
Congress Manifesto for Punjab polls

By

Published : Feb 18, 2022, 4:54 PM IST

Congress Manifesto for Punjab polls: పంజాబ్​లో తిరిగి​ అధికారంలోకి వస్తే.. లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ తొలి నిర్ణయమని కాంగ్రెస్​ ప్రకటించింది. ఫిబ్రవరి 20న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది.

మహిళలకు నెలనెలా రూ. 1100 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్​.

సంవత్సరానికి 8 గ్యాస్​ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని వెల్లడించింది.

Navjot Singh Sidhu: ఏడాదికి లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కల్పన తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు పంజాబ్​ కాంగ్రెస్​ చీఫ్​ నవజోత్​సింగ్​ సిద్ధూ. పార్టీ 13- పాయింట్ల అజెండా కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ దార్శనికతను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతుల పండించే నూనెగింజలు, మొక్కజొన్న, పప్పులను ప్రభుత్వమే సేకరిస్తుందని సిద్ధూ హామీ ఇచ్చారు.

''మద్యం అమ్మకాలు, ఇసుక తవ్వకాల కోసం కార్పొరేషన్లను ఏర్పాటుచేసి మాఫియాను అంతమొందిస్తాం. గృహిణులకు రూ. 1100 చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం.''

- నవజోత్​సింగ్​ సిద్ధూ, పంజాబ్​ కాంగ్రెస్​ చీఫ్​

Punjab polls 2022: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శుక్రవారమే చివరి రోజు. 20న ఎన్నికలు నిర్వహించి.. మార్చి 10న ఫలితాలు వెలువరించనున్నారు. ప్రచారం చివరిరోజే కాంగ్రెస్​ మేనిఫెస్టోను విడుదల చేయడం విశేషం.

ఇవీ చూడండి:'భాజపా గెలిస్తే స్టూడెంట్స్​కు స్కూటీలు, ల్యాప్​టాప్​లు ఫ్రీ!'

యూపీలో భాజపా 'సురక్ష' నినాదం గెలిపిస్తుందా?

ఎన్నికల వేళ సిక్కు ప్రముఖులకు ప్రధాని మోదీ ఆతిథ్యం..

ABOUT THE AUTHOR

...view details