కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి స్థానంలో మరొకరిని నియమించాలని పార్టీ అధిష్ఠానం దృష్టిపెట్టింది. ఈ నెల 19నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనుండటంతో అంతకుముందే లోక్‌సభాపక్ష నేతను నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే, కాంగ్రెస్ పార్టీపై అసమ్మతి తెలియజేస్తూ సంస్థాగత మార్పుల కోసం గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లోని (జీ -23) ఒకరికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ గాంధీ మాత్రం వ్యవహరించబోరని సమాచారం.
శశిథరూర్, ఉత్తమ్ కుమార్?
ఈ పదవికి ప్రధాన పోటీదారులుగా శశిథరూర్, మనీశ్ తివారీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా గౌరవ్ గొగొయి, రన్‌వీత్ సింగ్ బిట్టూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లు కూడా వినబడుతున్నాయి. శశిథరూర్, మనీశ్ తివారీ జీ-23 నేతల జాబితాలో ఉన్నారు.