తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్​ భేటీ పెట్టారేమో : ఉత్తమ్​కుమార్​ రెడ్డి

Congress Leaders Met CEO Vikas Raj : ఆపిన రైతుబంధు డబ్బుల నుంచి బీఆర్​ఎస్​ ప్రభుత్వం నచ్చిన గుత్తేదార్లకు రూ.6 వేల కోట్ల వరకు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. అలాగే అసైన్డ్ భూముల రికార్డులను సైతం మార్చేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోకుండా చూడాలని ఈసీని కోరినట్లు ఉత్తమ్‌ తెలిపారు.

Congress Leaders compliant to CEO Vikas Raj
Congress Leaders Met CEO Vikas Raj

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 3:42 PM IST

Congress Leaders Met CEO Vikas Raj : కాంగ్రెస్​ నేతలు రేవంత్​ రెడ్డి, ఉత్తమ్ ​కుమార్​ రెడ్డి, మధుయాస్కీ, అంజన్​ కుమార్​ యాదవ్, పొంగులేటి శ్రీనివాస్​ యాదవ్, మహేశ్​ కుమార్​ గౌడ్ తదితరులు సీఈవో వికాస్​రాజ్​ను కలిశారు. హైదరాబాద్​లో అసైన్డ్​ భూముల రిజిస్ట్రేషన్​కు కుట్ర జరుగుతోందని ఫిర్యాదు చేశారు. అసైన్డ్ భూములను ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేస్తున్నారని సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని, రైతుబంధు నిధులను గుత్తేదార్లకు చెల్లించకుండా చూడాలని మొత్తం 4 అంశాలపై కాంగ్రెస్​ నేతలు వికాస్​రాజ్​కు కంప్లైంట్​ చేశారు.

ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రంలోకి ఎప్పుడైనా వెళ్లారా? లోపల ఏం జరుగుతుందో తెలుసా?

ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోకూడదు: ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్​కుమార్​రెడ్డి రైతుబంధు నిధుల్లోంచి నచ్చిన గుత్తేదార్లకు రూ.6 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూముల రికార్డులు మార్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఈ ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోకూడదన్న ఆయన ఈ మేరకు ఎన్నికల కమిషన్​ను కోరామని స్పష్టం చేశారు.

రాజీనామా సమర్పించేందుకే కేబినెట్ భేటీ: ఈ క్రమంలోనే రేపు గెలుపు ధ్రువపత్రాలను తమ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు తీసుకుంటారని ఉత్తమ్‌ కుమార్​ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్వోలకు ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను కోరామని తెలిపారు. ఈ నెల 4న కేసీఆర్​ కేబినెట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అసలు మంత్రివర్గ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదన్నారు. రాజీనామా సమార్పించేందుకే కేబినెట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలంగాణలో 70.79% పోలింగ్‌ - మళ్లీ పట్నం బద్ధకించింది - పల్లె ఓటెత్తింది

నచ్చిన గుత్తేదార్లకు రూ.6 వేల కోట్లు ఇచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అసైన్డ్ భూముల రికార్డులు మార్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోకూడదు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చూడాలని ఈసీని కోరాం. ఎల్లుండి కేసీఆర్‌ కేబినెట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. కేసీఆర్ కేబినెట్ మీటింగ్‌ ఎందుకు ఏర్పాటు చేశారో మాకు తెలియదు. రాజీనామా సమర్పించేందుకే కేబినెట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసి ఉండొచ్చు. - ఉత్తమ్​కుమార్​ రెడ్డి, కాంగ్రెస్​ నేత

రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్​ భేటీ పెట్టారేమో : ఉత్తమ్​కుమార్​ రెడ్డి

తెలంగాణ ప్రజలకు అలర్ట్ - రేపు వైన్ షాపులు, రెస్టారెంట్లు బంద్

ABOUT THE AUTHOR

...view details