కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఉత్తరాఖండ్ నైనీతాల్లోని ఆయన ఇంటిని ధ్వంసం చేసి.. నిప్పంటించారు. ఈ ఘటనలో 20 మందిపై కేసు నమోదు చేసినట్లు డీజీఐ నీలేశ్ ఆనంద్ తెలిపారు. ఈ ఘటనకు పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటికి నిప్పు.. వారి పనే!
కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటికి నిప్పంటించారు కొందరు దుండగులు. ఉత్తరాఖండ్ నైనీతాల్ జిల్లాలో ఆయన ఇంటిపై దాడి చేసి.. ఇంటిని ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
సల్మాన్ ఖుర్షీద్
ఖుర్షీద్ ఇటీవల రాసిన 'సన్‌రైజ్ ఓవర్ అయోధ్య- నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్' పుస్తకం.. ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. హిందువుల మనోభావాలను కించపరిచేలా ఈ పుస్తకం రాశారని కొందరు ఆరోపిస్తున్నారు.
Last Updated : Nov 15, 2021, 7:12 PM IST