తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంధన ధరలపై మోదీ సర్కారుకు రాహుల్ చురకలు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం(rahul gandhi on petrol prices) వ్యక్తం చేశారు. జీడీపీ పెరుగుతోందని మోదీ తరచుగా చెప్పేది.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ గురించేనని(gdp gas diesel petrol) వ్యంగస్త్రాలు సంధించారు. గత ఏడేళ్లలో ఇంధన ధరల పెరుగుదల ద్వారా ప్రభుత్వం రూ. 23 లక్షల కోట్లు సంపాదించిందని తెలిపారు.

RAHUL GANDHI petrol prices
రాహుల్ పెట్రోల్ ధరలు

By

Published : Sep 1, 2021, 5:37 PM IST

దేశంలో నిత్యం పెరిగిపోతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi). వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటడంపై తీవ్రస్థాయిలో(rahul gandhi on petrol prices) మండిపడ్డారు. యూపీఏ హయాంలో పెట్రోల్ ధరలతో.. ప్రస్తుత ధరలను పోలుస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"జీడీపీ పెరుగుతోందని మోదీ ఎప్పుడూ చెబుతుంటారు. జీడీపీ వృద్ధి బాటలో పయనిస్తోందని ఆర్థిక మంత్రి అంటుంటారు. జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్(gdp gas diesel petrol) అని నాకు తర్వాత అర్థమైంది. వారికి ఈ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. 2014లో యూపీఏ ప్రభుత్వం దిగిపోయే సమయంలో ఎల్​పీజీ సిలిండర్ ధర రూ.410గా ఉంది. ఇప్పుడది రూ.885కు పెరిగింది. 116 శాతం పెరుగుదల. పెట్రోల్ లీటర్​కు(petrol prices in upa government) రూ.71.5, డీజిల్ రూ.57/లీ ఉండేది. ఇప్పుడు ఈ ధరలు రూ.101, రూ.88కి పెరిగిపోయాయి. రైతులు, శ్రామికులు, చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు, ఉద్యోగుల నుంచి మోదీ ప్రభుత్వం పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేసి.. నలుగురు-ఐదుగురు స్నేహితుల జేబులు నింపుతోంది."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

2014 తర్వాత అంతర్జాతీయంగా ఇంధన ధరలు తక్కువగానే ఉన్నాయని రాహుల్ పేర్కొన్నారు. భారత్​లో మాత్రం ధరలను పెంచుతూనే ఉన్నారని ధ్వజమెత్తారు. ఇంధన ధరలు పెంచడం ద్వారా గత ఏడేళ్లలో ప్రభుత్వం(govt income from petrol) రూ. 23 లక్షల కోట్లు సంపాదించిందని తెలిపారు.

జలియన్​వాలా బాగ్​ ఆధునికీకరణపై..

కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తరచుగా విమర్శలు చేస్తున్నారు. జలియన్‌వాలా బాగ్‌ స్మారక ప్రాంగణం ఆధునికీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మారక ప్రాంగణం ఆధునీకరించటం.. అమరులను అవమానపరచడమేనని.. బలిదానానికి అర్థం తెలియని వ్యక్తులు మాత్రమే అలాంటి వాటికి పాల్పడతారని దుయ్యబట్టారు. అక్కడ డిస్కో లైట్ల వంటివి ఏర్పాటు చేయడం వల్ల అదో వేడుక ప్రదేశంగా మారుతుందే తప్ప ఆనాటి మారణహోమం తీవ్రతను గుర్తుచేయదన్న ఉద్దేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు రాహుల్​గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు భాజపా నేతలు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జలియన్‌వాలా బాగ్‌ స్మారక ప్రాంగణంలో కనీసం టాయిలెట్ అయినా కట్టించలేదని ఆరోపించారు. స్మారకం కోసం కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని భాజపా జనరల్ సెక్రటరీ తరుణ్ చుగ్ ప్రశ్నించారు.

ఇదీ చదవండి:'నేనూ అమరవీరుడి బిడ్డనే.. ఈ అవమానాన్ని సహించను!'

ABOUT THE AUTHOR

...view details