మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ 37వ వర్ధంతి సందర్భంగా.. కాంగ్రెస్ ప్రముఖులు నివాళులు అర్పించారు. దిల్లీలోని శక్తిస్థల్ను సందర్శించిన రాహుల్ గాంధీ.. ఇందిరాకు పుష్పాంజలి ఘటించారు. ఆమె సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు రాహుల్.
ఇందిరా గాంధీ సమాధి వద్ద రాహుల్ నివాళి పూలతో నివాళులర్పిస్తున్న రాహుల్ "ఇందిరాగాంధీ తన చివరి క్షణం వరకు దేశానికి సేవ చేశారు. ఆమె జీవితం మాకు స్ఫూర్తిదాయకం. అంతేగాకుండా మహిళా సాధికారతకు ఆమె ఉదాహరణ. ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఇవే మా ఘననివాళులు."
-రాహుల్ గాంధీ
శక్తి స్థల్లో ఇందిరా ఘాట్ చుట్టూ తిరుగుతున్న రాహుల్ మౌనం పాటిస్తున్న రాహుల్ గాంధీ భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీనే కావడం విశేషం. ఇందిరా 1966-1977 వరకు ప్రధానిగా పని చేశారు. మరోమారు 1980లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1984, అక్టోబర్ 31న అక్బర్ రోడ్ లోని ఆమె అధికారిక నివాసంలో ఇద్దరు బాడీగార్డ్స్ కాల్పులు జరపటం వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:Azadi Ka Amrit Mahotsav: మేనన్ తలకు పెన్-గన్!