మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో నివాళులర్పించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. దిల్లీలోని శక్తిస్థల్ వద్ద గులాబీ రేకులను ఆమె సమాధిపై ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఇతర కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆయనకు తోడు రాగా ప్రధానిగా ఆమె సేవలను రాహుల్ గుర్తు చేస్తుకున్నారు. స్ఫూర్తి దాయకమైన నాయకత్వానికి ఉదాహరణగా దేశ ప్రజలు ఇప్పటికీ ఇందిరా గాంధీని కీర్తిస్తున్నట్లు రాహుల్ ట్విట్టర్‌లో అన్నారు.
ఇందిరా గాంధీకి మోదీ, రాహుల్ నివాళులు - ఇందిరా గాంధీ జయంతి
మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆమెకు నివాళులర్పించారు. దిల్లీలోని శక్తిస్థల్లో ఉన్న ఇందిర సమాధి వద్దకు రాహుల్ సహా పార్టీ ముఖ్యనేతలు చేరుకున్నారు. దేశానికి ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఇందిరా గాంధీకి నివాళులర్పించిన రాహుల్
అటు కాంగ్రెస్ పార్టీ సైతం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇందిరాగాంధీకి నివాళులు అర్పించింది. దూరదృష్టి గల నాయకురాలిగా ఇందిరను అభివర్ణించిన కాంగ్రెస్.. దేశప్రజలకు ఒక ప్రధానిగా కంటే ఎక్కువే చేశారని కొనియాడింది.