Uttar Pradesh polls: ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అందరికంటే ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది కాంగ్రెస్. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా 125 మంది పేర్లతో జాబితా విడుదల చేశారు. ఇందులో 40శాతం మంది మహిళలు, 40శాతం మంది యువకులకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. తమ చారిత్రక నిర్ణయంతో యూపీలో సరికొత్త రాజకీయాలకు తెరలేస్తుందని ఆశిస్తున్నట్లు ప్రియాంక అభిప్రాయపడ్డారు.
UP assembly polls congress candidates
125 మంది జాబితాలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్కు కూడా టికెట్ కేటాయించినట్లు ప్రియాంక వెల్లడించారు. గౌరవవేతనాల కోసం పోరాడిన ఆశా వర్కర్ పూనమ్ పాండే షాజహాన్పుర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. తొలి జాబితాలో మొత్తం 50మంది మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఉత్తర్ప్రదేశ్లో మొత్తం 403 స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు మొత్తం 7 విడతల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి. అయితే కాంగ్రెస్ మినహా ఏ పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.
ఇదీ చదవండి:భాజపా సీఈసీ భేటీ- యూపీ ఎన్నికల అభ్యర్థుల ఖరారుపై కసరత్తు