తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీస్ కస్టడీలో మరణించిన 'వాల్మీకి' కుటుంబానికి ప్రియాంక పరామర్శ - ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల్లో పోటీ చేస్తారా?

పోలీసు కస్టడీలో మరణించిన పారిశుధ్య కార్మికుడు అరుణ్ వాల్మీకి కుటుంబాన్ని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా పరామర్శించారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఆగ్రా చేరుకున్న ఆమె.. పోలీసుల దెబ్బలు తట్టుకోలేకే అరుణ్​ కస్టడీలో మరణించాడని ఆరోపించారు.

Priyanka Gandhi Vadra
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ప్రియాంక

By

Published : Oct 21, 2021, 2:05 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో దొంగతనం కేసులో అరెస్టయిన పోలీస్​ కస్టడీలో మరణించిన పారిశుద్ధ్య కార్మికుని కుటుంబాన్ని ప్రియాంక గాంధీ వాద్రా పరామర్శించారు. పోలీసుల దాడిలో బాధితుని ఇల్లంతా ధ్వంసమైందని.. పేదల కుటుంబాల్లో అన్యాయం జరుగుతోందని ఈ సందర్భంగా ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు.

చీకట్లో వాల్మీకి ఇంటికి ప్రియాంక
వాల్మీకి ఇంటికి వెళుతున్న ప్రియాంక

అరుణ్ వాల్మీకి కుటుంబాన్ని కలిశాను. ఈ రోజుల్లో ఎవరికైనా ఇలా జరుగుతుందంటే నమ్మలేకపోతున్నా. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన 17-18 మందిని వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేసి మరీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిసింది. వారందరినీ దారుణంగా కొట్టారు. అరుణ్‌ని తన భార్య ముందే పోలీసులు కొట్టారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో అతను బాగానే ఉన్నాడని వాల్మీకి సోదరులు చెబుతున్నారు. కానీ అంతలోనే.. ఏమయిందో ఏమో.. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. పోస్టుమార్టం రిపోర్టును సైతం కుటుంబానికి ఇవ్వలేదు.

-ప్రియాంక గాంధీ వాద్రా

అరెస్టు.. విడుదల..

అంతకముందు రాజకీయ నేతలు అక్కడకు వెళ్లేందుకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్​ నుంచి ఆదేలున్నాయని, ప్రియాంకను యూపీ పోలీసులు అడ్డుకున్నారు. భారీఎత్తున గుమిగూడిన కాంగ్రెస్ కార్యకర్తలతో కాసేపు ఉద్రిక్త వాతావారణం నెలకొంది. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేశాయి. ఆ తర్వాత ప్రియాంకా గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాసేపటికి విడిచిపెట్టారు.

ప్రియాంక రాక సందర్భంగా గుమిగూడిన జనం
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ప్రియాంక

రూ.25లక్షల చోరీ కేసు..

ఆగ్రా జగదీశ్​పుర పోలీస్​ స్టేషన్​లో పోలీసులకు సంబంధించిన వస్తువులు ఉండే మాల్​ఖానాలో రూ.25లక్షల దొంగతనం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు పోలీస్​ సిబ్బందిని ఏడీజీ సస్పెండ్ చేశారు. మాల్​ఖానాలో పనిచేసే సిబ్బందిని విచారించారు. అక్కడే పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న నిందితుడు అరుణ్​ను పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. పోలీస్​ కస్టడీలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే దొంగతనం చేసింది తానే అని అరుణ్​ విచారణలో అంగీకరించాడని పోలీసులు చెప్పారు. అతడిచ్చిన సమాచారం మేరకే అతని ఇంట్లో రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఇంట్లో సోదాలు జరుగుతున్న సయమంలోనే అరుణ్ ఆరోగ్యం క్షీణించిందని, ఆస్పత్రికి తరలించగా మరణించినట్లు తెలిసిందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details