తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సిద్ధూ ఇంట్లో అనుమానాస్పద వ్యక్తి! బ్లాంకెట్​ కప్పుకొని మేడపై..

కాంగ్రెస్​ నేత నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ ఇంటిపై ఓ అనుమానాస్పద వ్యక్తి కనిపించాడు. ఆదివారం సాయత్రం ఆ వ్యక్తి.. మేడపై కనిపించినట్లు ట్విట్టర్​ ద్వారా సిద్ధు వెల్లడించారు. దీంతో పోలీసులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

congress-leader-navjot-singh-sidhu-suspicious-person-spotted-in-sidhu-house-panjab
సిద్ధూ ఇంట్లో అనుమానాస్పద వ్యక్తి

By

Published : Apr 17, 2023, 10:29 AM IST

తన ఇంటి మేడపై ఓ అనుమానాస్పద వ్యక్తి కనిపించినట్లు.. పంజాబ్​ కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్​ సింగ్​ సిద్ధు ఆరోపించారు. ట్విట్టర్​ ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పటియాలాలోని తన ఇంటి రూఫ్​పై ఈ వ్యక్తి కనిపించినట్లు సిద్ధు పేర్కొన్నారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన సిద్ధు.. ఎలాంటి ఘటనలకు భయపడేది లేదని సృష్టం చేశారు.

"ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో బూడిద రంగు బ్లాంకెట్​ను చుట్టుకుని ఓ వ్యక్తి కనిపించాడు. అతడిని గుర్తించిన నా సిబ్బంది వెంటనే అలారం మోగించాడు. మిగతా వారిని అప్రమత్తం చేశాడు. దీంతో ఆ అనుమానాస్పద వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై రాష్ట్ర డీజీపీకి, పటియాలా ఎస్​ఎస్​పీకి ఫిర్యాదు చేశా" అని సిద్ధు ట్వీట్​లో వెల్లడించారు. ఇటువంటి భద్రత లోపాలు.. పంజాబ్​ కోసం గొంతెత్తె తన నోటిని కట్టివేయలేవని తెలిపారు.

ఏప్రిల్​ 1న విడుదల జైలు నుంచి విడుదలైన సిద్ధూ..
నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఏప్రిల్​ 1న విడుదల జైలు నుంచి విడుదల అయ్యారు. మూడున్నర దశాబ్దాల క్రితం జరిగిన ఓ ఘర్షణ కేసులో నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్షను విధించింది. గతేడాది మే నుంచి పంజాబ్​లోని పటియాలా సెంట్రల్ జైల్లోనే ఉన్న ఆయనకు.. సత్ప్రవర్తన కారణంగా శిక్షా కాలం కాస్త తగ్గింది.

శిక్ష ఎందుకు?
34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణకు సంబంధించిన కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష పడింది. 1988 డిసెంబరు 27న పటియాలో పార్కింగ్‌ విషయంలో జరిగిన ఘర్షణలో 65 ఏళ్ల గుర్నామ్‌ సింగ్‌ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో సిద్ధూతోపాటు రూపిందర్‌.. గుర్నామ్​పై దాడి చేశారనే అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుపై పలు కోర్టుల్లో విచారణ ముగిసిన అనంతరం.. ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు 2022 మే నెలలో తీర్పు వెలువరించింది. దీంతో మే 20న కోర్టు ముందు లొంగిపోయిన ఆయన్ను పటియాలా సెంట్రల్​ జైలుకు తరలించారు.

'రాహుల్ ఓ విప్లవం..'
జైలు నుంచి విడుదల కాగానే కేంద్రంపై విమర్శలు గుప్పించారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ. పటియాలా జైలు నుంచి బయటకు రాగానే మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేశారని ఆరోపించారు. స్వతంత్ర సంస్థలను బందీలుగా చేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నియంతృత్వాన్ని ఎదిరించే విప్లవం అన్నారు. పంజాబ్​లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details