తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​కు భారీ షాక్​- భాజపాలోకి ఆజాద్​ సోదరుడి కుమారుడు - భాజపాలోకి గులాం నబీ ఆజాద్​ సోదరుడి కుమారుడు

జమ్ముకశ్మీర్​లో కాంగ్రెస్​కు భారీ షాక్​ తగిలింది. కాంగ్రెస్​ కీలక నేత గులాం నబీ ఆజాద్​ సోదరుడి కుమారుడు భాజపాలో చేరారు. కొంతకాలంగా కాంగ్రెస్​ సీనియర్​ నేతలు పార్టీని వీడుతున్న క్రమంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది.

ghulam nabi azad nephew
ghulam nabi azad nephew

By

Published : Feb 27, 2022, 6:15 PM IST

కాంగ్రెస్​ కీలక నేత గులాం నబీ ఆజాద్​ సోదరుడి కుమారుడు ముబాశిర్​ ఆజాద్​.. భాజపాలో చేరారు. జమ్ముకశ్మీర్​ భాజపా అధ్యక్షుడు రవీందర్ రైనా, ఇతర సీనియర్​ నాయకుల సమక్షంలో ముబాశిర్​తో పాటు ఆయన మద్దతుదారులు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 'క్షేత్రస్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యకలాపాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. అందుకే భాజపాలో చేరాను' అని వెల్లడించారు.

భాజపా నేతతో ముబాశిర్​

ఆజాద్​ తమ్ముడి కుమారుడైన ముబాశిర్​.. 'కాంగ్రెస్ అదిష్ఠానం మా పెదనాన్నను అగౌరవపరిచింది. అది నన్ను బాధించింది. ఆ పార్టీ నుంచి విడిపోయేలా చేసింది' అని పేర్కొన్నారు. అయితే భాజపాలో చేరే విషయం గురించి గులాం నబీ ఆజాద్​తో చర్చించలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత పోరులో కూరుకుపోయిందని.. మోదీ నాయకత్వంలో ప్రజల సంక్షేమం కోసం పనులు జరుగుతున్నాయని అన్నారు.

భాజపా కండువా కప్పుకున్న ముబాశిర్​

"పార్టీ ప్రజాకర్షక నేతల్లో ఒకరైన, మాజీ ముఖ్యమంత్రి (గులాం నబీ) ఆజాద్‌తో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు సామాన్య ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. దేశానికి సేవ చేసిన ఆయనను పార్లమెంట్​లో ప్రధాని మోదీ ప్రశంసించారు. అయితే కాంగ్రెస్​ పార్టీనే పక్కన పెట్టింది" అని ముబాశిర్​ వ్యాఖ్యానించారు.

గతేడాది కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం, సంస్థాగత నిర్మాణంలో మార్పు అవసరమంటూ ఎత్తిచూపిన 23 మంది (జీ23) నేతల్లో ఆజాద్‌ కూడా ఉన్నారు. ఈ పరిణామాల తర్వాత ఆజాద్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించడం, ఆజాద్‌కు కేంద్రం పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించడం కాంగ్రెస్‌కు మింగుడుపడని చర్యలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:యూపీ ఐదో దశ ఎన్నికలు ప్రశాంతం- 54% ఓటింగ్​!

ABOUT THE AUTHOR

...view details