తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​కు బై- టీఎంసీకి జై - Sushmita Dev

కాంగ్రెస్ పార్టీకి సీనియర్​ నేత సుష్మితా దేవ్​ గుడ్​బై చెప్పారు. రాజీనామా లేఖను అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. అనంతరం కొద్ది గంటల వ్యవధిలోనే ఆమె తృణమూల్​ కాంగ్రెస్​లో చేరారు. అభిషేక్​ బెనర్జీ, డెరెక్​ ఒబ్రెయన్​ల సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

Congress leader from Assam Sushmita Dev identifies herself as "Former Member, Indian National Congress" in her Twitter bio.
కాంగ్రెస్​ పార్టీకి మరో కీలక నేత గుడ్​బై

By

Published : Aug 16, 2021, 10:42 AM IST

Updated : Aug 16, 2021, 3:17 PM IST

కాంగ్రెస్​ పార్టీని వీడిన సీనియర్​ నేత సుష్మితా దేవ్​.. కొద్ది గంటల వ్యవధిలో తృణమూల్​ కాంగ్రెస్​లో చేరారు. బంగాల్​ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్​ బెనర్జీ, డెరెక్​ ఒబ్రెయన్​ సమక్షంలో టీఎంసీ కండువా కప్పుకున్నారు సుష్మిత​.

అంతకుముందు.. కాంగ్రెస్​ను వీడుతున్నట్టు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు సుష్మిత.

కాంగ్రెస్​కు బై- టీఎంసీకి జై
కాంగ్రెస్​కు బై- టీఎంసీకి జై

30ఏళ్ల పాటు కాంగ్రెస్​కు సేవలందించిన.. సుష్మిత 2011లో పార్టీ తరఫున​ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో సిల్చర్​ నుంచి ఎంపీగా విజయం సాధించారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగానూ ఉన్నారు. అయితే ఆమె తృణమూల్ కాంగ్రెస్​లో చేరుతారని ముందునుంచే ఊహాగానాలు వెలువడ్డాయి. ఇప్పుడు అవే నిజమయ్యాయి.

కాంగ్రెస్​కు బై- టీఎంసీకి జై

రాజీనామా అనంతరం తన ట్విట్టర్ బయోను కాంగ్రెస్ మాజీ నేత అని అప్డేట్​ చేశారు సుష్మిత.

ఇదీ చూడండి:'ఏడేళ్లుగా ప్రధాని మోదీది అదే ప్రసంగం'

Last Updated : Aug 16, 2021, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details