కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన సాగు చట్టాల విషయంలో ఉమ్మడి వ్యూహాన్ని రచించేందుకు సన్నద్ధమవుతోంది కాంగ్రెస్. ఈ మేరకు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిపక్షాలతో మాట్లాడినట్టు తెలుస్తోంది.
సాగు చట్టాలపై విపక్షాల ఉమ్మడి పోరు! - సోనియా గాంధీ వార్తలు
సాగు చట్టాల వ్యవహారంపై పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇందుకోసం ఇతర విపక్షాలతో కలిసి వ్యూహం రచించేందుకు ప్రయత్నిస్తోంది.
![సాగు చట్టాలపై విపక్షాల ఉమ్మడి పోరు! Congress Interim President Sonia Gandhi has spoken to the Opposition leaders to make a joint strategy on FarmLaws](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10201518-thumbnail-3x2-sonia.jpg)
సాగు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ 'ప్రతిపక్ష' వ్యూహం!
ఈ నెల 29న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో.. భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తోంది కాంగ్రెస్. కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై చర్చించేందుకు విపక్ష నాయకులతో ఆమె త్వరలోనే భేటీ కానున్నట్టు సమాచారం.
ఇదీ చదవండి:'గాడ్సే' లైబ్రరీ ప్రారంభించిన హిందూ మహాసభ