అసోంలో నిర్వహించిన ప్రచార సభలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వరాలజల్లు కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలు అందరికీ 'గృహిణి సమ్మాన్' ప్రథకంలో భాగంగా నెలకు రూ.2000 అందజేస్తామన్నారు. అంతేకాకుండా టీ తోటల్లో పనిచేసే మహిళలకు రోజుకు రూ.365 వేతనం ఇస్తామని తెలిపారు.
'మేం గెలిస్తే పౌరచట్టం రద్దు- కరెంట్ ఫ్రీ' - ప్రియాంక గాంధీ
అసోంలో తాము అధికారంలోకి వస్తే పౌరసత్వచట్టాన్ని రద్దు చేసే కొత్త చట్టాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. అంతే కాకుండా 200 యూనిట్లులోపు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.
'మేం గెలిస్తే పౌరచట్టం రద్దు- కరెంట్ ఫ్రీ'
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పౌరసత్వ చట్టాన్ని రద్దు చేసే చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. అంతేకాకుండా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని తెలిపారు. ఇంకా.. 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:ఆజాద్‌కు వ్యతిరేకంగా జమ్ములో నిరసన
Last Updated : Mar 2, 2021, 4:46 PM IST