కాంగ్రెస్ ఎక్కడకు వెళితే.. అక్కడ కుంభకోణాలకు పాల్పడుతుందని ఆరోపించారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. అదే ఆ పార్టీ నుంచి ఆశించే అసలైన హామీ అని ఎద్దేవా చేశారు. అసోంలో మరోసారి ఎన్డీఏ కూటమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాజోత్ కూటమి ఇచ్చిన ఐదు హామీలపై ఆయన విమర్శలు గుప్పించారు.
"అసోంలో అధికారంలోకి వస్తే సీఏఏను అమలు కానివ్వబోమని వాళ్లు హామీ ఇస్తున్నారు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఒక రాష్ట్రం ఎలా మార్చగలదు? ప్రజలను వాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారు. కాంగ్రెస్కు మరో పేరు అబద్ధం. వాళ్లు ఎక్కడికి వెళితే.. అక్కడ కుంభకోణాలకు పాల్పడుతారని నేను మీకు హామీ ఇస్తున్నాను."
-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు
అసోంలోని ప్రతిపక్ష పార్టీ.. రాజకీయ పర్యటనలు చేస్తోందని నడ్డా విమర్శించారు. అసోంలో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. తేయాకు కార్మికుల ప్రయోజనం కోసం ఏమీ చేయలేదని అన్నారు.