06:29 PM
ఇవాళ ప్రమాణ స్వీకారానికి అవకాశం లేనట్లే!
కొత్త సీఎం ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇంకా ఎటూ తేల్చలేదు. ఉదయం డీకే శివకుమార్ సీఎల్పీ సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేల అంగీకారంతో సీఎం ఎంపికను అధిష్ఠానానికే అప్పగించారు. అయితే కొత్త సీఎం ఎంపికపై కాంగ్రెస్ నేతల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో అధిష్ఠానంతో చర్చించేందుకు డీకే దిల్లీ వెళ్లారు. ఇదిలా ఉండగా ఇవాళ ప్రమాణ స్వీకారానికి అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
06:58 PM
దిల్లీకి డీకే శివకుమార్
సీఎల్పీ నేత ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే సీఎల్పీ నేత ఎంపికపై అధిష్ఠానంతో మాట్లాడేందుకు డీకే శివకుమార్ దిల్లీకి బయలుదేరి వెళ్లారు.
4.54PM
రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. గెజిట్‌ను గవర్నర్ తమిళి సైకు సీఈఓ వికాస్ రాజ్, ఈసీ ముఖ్య కార్యదర్శి అవినాష్ అందించారు.
3.51PM
రాజ్‌భవన్ వెళ్లిన రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్
రాష్ట్రంలో ఆదివారం వెలువడిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను తీసుకుని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. అనంతరం ఎన్నికల ఫలితాల జాబితాను గవర్నర్ తమిళిసై కు అందించారు.
01.09 PM
అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తామన్న ఎమ్మెల్యేలు
సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను పార్టీ అధిష్ఠానానికే ఎమ్మెల్యేలు అప్పగించారు. అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తామని తీర్మానం చేశారు.
దీంతో ఈ భేటీలో చేసిన తీర్మానాన్ని పరిశీలకులు అధిష్ఠానానికి పంపించారు. సమావేశానికి హాజరైన పరిశీలకులు డీకే శివకుమార్, జార్జ్, సమావేశానికి హాజరైన దీపాదాస్ మున్షీ, అజయ్, మురళీధరన్ ఉన్నారు. సమావేశంలో ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి, ఉత్తమ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
01.03 PM
సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఖర్గేకు అప్పగిస్తూ తీర్మానం
సీఎల్పీ భేటీ జరిగిందని డీకే శివకుమార్ తెలిపారు. ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశామన్నారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఖర్గేకు అప్పగిస్తూ తీర్మానం చేశామని అన్నారు.
12. 49 PM
ముగిసిన సీఎల్పీ సమావేశం
గచ్చిబౌలిలో సీఎల్పీ సమావేశం ముగిసింది. దాదాపు గంటసేపు సమావేశం జరిగింది. రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ నేతల బృందం వెళ్లనున్నారు.
12. 32 PM
ఈ సాయంత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు
ఈ సాయంత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క ప్రమాణం చేసే అవకాశం ఉంది.
12.25 PM
ఈసీ అధికారులతో పాటు గవర్నర్‌ను కలవనున్న సీఈవో
సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను సీఈవో వికాస్‌రాజ్ కలవనున్నారు. ఈసీ సీనియర్ అధికారులు మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు. వారితో పాటు గవర్నర్‌ను కలవనున్నారు.
11.59 AM
కొనసాగుతున్న సీఎల్పీ సమావేశం
గచ్చిబౌలిలోని హోటల్‌లో సీఎల్పీ సమావేశం కొనసాగుతున్నది. సమావేశానికి డీకే శివకుమార్, జార్జ్, దీపాదాస్ మున్షీ, అజయ్, మురళీధరన్ సమావేశానికి హాజరైయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి, ఉత్తమ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.
11.39 AM
మీడియాలో రేవంత్ సీఎం అవతారన్న ప్రచారంపై నిరసన వ్యక్తం చేసిన డీకే
హోటల్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో డీకే శివకుమార్ భేటీ అయ్యారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, దామోదర రాజనరసింహ, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి సోదరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మీడియాలో రేవంత్ సీఎం అవతారన్న ప్రచారంపై నిరసన వ్యక్తం చేశారు. ఏఐసీసీ నుంచి సీఎల్పీ నేత ఎన్నిక ఇబ్బందులు లేకుండా కొనసాగాలని ఆదేశించారు.
11.37 AM
గచ్చిబౌలిలోని హోటల్‌లో సీఎల్పీ సమావేశం
గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో సీఎల్పీ సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. సీఎల్పీ సమావేశం తర్వాతే కాంగ్రెస్ నిర్ణయం వెల్లడించనున్నారు. సీఎల్పీ నేత ఎంపిక తర్వాత కాంగ్రెస్ బృందం గవర్నర్‌ను కలవనున్నారు.
11.34 AM
ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌లో ప్రారంభమైన ఏర్పాట్లు
ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు ప్రారంభమైయ్యాయి. ముందస్తుగా ఏర్పాట్లలో భాగంగా టెంట్లు, కుర్చీలు, ఇతర సామాగ్రిని అధికారులు రాజ్‌భవన్‌కు తరిలిస్తున్నారు.
11.30 AM
గచ్చిబౌలిలో ఎల్లా హోటల్‌కు చేరుకున్న డీకే శివకుమార్
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఎల్లా హోటల్‌కు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేరుకున్నారు.
11.17 AM
కాసేపట్లో రాజ్‌భవన్‌కు సీఈవో వికాస్‌రాజ్
కాసేపట్లో రాజ్‌భవన్‌కు సీఈవో వికాస్‌రాజ్ చేరుకోనున్నారు. రాష్ట్రంలో జరిగన శాసనసభ ఎన్నికలపై నివేదిక ఇవ్వనున్నారు. కొత్త శాసనసభ ఏర్పాటు నోటిఫికేషన్‌ను గవర్నర్‌కు అందించనున్నారు.
09.55 AM
కాసేపట్లో సీఎల్పీ సమావేశం
రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి ఉత్కంఠ నెలకొంది. సీఎం అభ్యర్థిపై మరింత ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని కాసేపట్లో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఇందులో ముఖ్యమంత్రి అభ్యర్థిని సీఎల్పీ నేత ఎన్నుకోనున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం తరవాత బహిరంగంగా సీఎం అభ్యర్థిని వెల్లడించనుంది.
సీఎం అభ్యర్థి కంటే ముందే సీఎల్పీ నేతను ఎన్నుకొనే అవసరం కాంగ్రెస్ పార్టీలో ఏర్పడింది. దీంతో ఏఐసీసీ పరిశీలకుల సమక్షంలో సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియ జరగనుంది. అనంతరం కాంగ్రెస్ బృందం గవర్నర్‌ను కలవనున్నారు.