తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్ అలసిపోయింది.. ఇప్పుడు మాదే రియల్ కాంగ్రెస్' - మమతా బెనర్జీ టీఎంసీ

Jago Bangla On Congress Party: దేశంలో ఓ వెలుగువెలిగిన కాంగ్రెస్​ పార్టీని 'యుద్ధంలో అలసిపోయిన గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ'గా అభివర్ణించింది టీఎంసీ. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా తన పాత్రను నిర్వర్తించడంలో ఆ పార్టీ విఫలమైందని.. ప్రస్తుతం తామే 'నిజమైన కాంగ్రెస్‌' అని ప్రకటించింది. ఈ మేరకు తన అధికార పత్రికలో ఓ కథనాన్ని ప్రచురించింది.

mamata benarjee
మమతా బెనర్జ

By

Published : Dec 8, 2021, 5:53 PM IST

Jago Bangla News: విపక్షాలకు నాయకత్వం వహించే అంశంపై కాంగ్రెస్‌ పాత్రను కొద్దిరోజులుగా బాహాటంగానే విమర్శిస్తూ వస్తోన్న తృణమూల్ కాంగ్రెస్.. భాజపాతో పోరాడే శక్తి తమకు మాత్రమే ఉందని పునరుద్ఘాటించింది. ఈ మేరకు పార్టీ అధికార పత్రిక 'జాగో బంగ్లా'లో కుండబద్ధలు కొట్టింది. 'విపక్షాలను ముందుకు తీసుకెళ్లే అంశంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పాత్ర అసమర్థంగా ఉంది' అని తాజా కథనంలో పేర్కొంది.

"కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌.. భాజపా జోరును ఆపగలగాలి. కానీ.. అంతర్గత కుమ్ములాటలు, కక్షలతో ఆ పార్టీ నలిగిపోతోంది. అయితే కాలం ఎవరి కోసం ఎదురుచూడదు. భాజపాను ఎదుర్కొనేందుకు మరొకరు ముందుకు రావాలి. టీఎంసీ ఆ బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఇదే నిజమైన కాంగ్రెస్"

--జాగో బంగ్లా సంపాదకీయ కథనం

Jago Bangla Editorial Today: రాహుల్ గాంధీ కన్నా.. మమతా బెనర్జీయే ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో కీలకంగా మారారని 'జాగో బంగ్లా' తన కథనం ఒకటి స్పష్టం చేసింది. అంతేగాక విపక్షంగా తాము అన్ని పార్టీలను కలుపుని వెళ్లాలని టీఎంసీ కోరుకుంటోందని వెల్లడించింది. ఫలితంగా కాంగ్రెస్-టీఎంసీ మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.

TMC Congress Fight: మరోవైపు.. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్-టీఎంసీ పలు అంశాల్లో విభేదిస్తూ వస్తున్నాయి.

  • మేఘాలయలో కాంగ్రెస్‌కు షాక్​నిస్తూ.. మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా నేతృత్వంలోని 17 మంది ఎమ్మెల్యేలలో 12 మంది ఇటీవల టీఎంసీలో చేరారు.
  • పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్‌తో కలసి పనిచేసేందుకు టీఎంసీ ఆసక్తి చూపించలేదు.
  • త్రిపుర మున్సిపల్ ఎన్నికల్లో భాజపాతో హోరాహోరీగా తలపడింది టీఎంసీ.
  • గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details