తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం ఎన్నికల కోసం కాంగ్రెస్​ స్క్రీనింగ్​ కమిటీ - అసోం ఎన్నికల్లో కాంగ్రెస్​

అసోం, బంగాల్​లో గెలుపే లక్ష్యంగా చర్యలు చేపట్టింది కాంగ్రెస్​. ఈ మేరకు అసోం ఎన్నికల కోసం స్క్రీనింగ్​ కమిటీని నియమించింది. ఛైర్మన్​గా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్​ను నియమించింది. బంగాల్​లోనూ 28 మంది పరిశీలకులను నియమించిన కాంగ్రెస్​.. వారికి ఆయా జిల్లాల బాధ్యతలు అప్పగించింది.

Congress appoints Prithviraj Chavan as chairman of screening panel for Assam polls
అసోం కాంగ్రెస్​ ఎన్నికల ఛైర్మన్​గా పృథ్విరాజ్​ చౌహాన్​

By

Published : Mar 1, 2021, 9:38 PM IST

అసోం శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్​ ప్రణాళికలు ముమ్మరం చేసింది. ఆ రాష్ట్రంలో ఎన్నికల స్క్రీనింగ్​ ప్యానెల్​ ఛైర్మన్​గా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్​ చౌహాన్​ను నియమించింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ గతేడాది.. అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన(జీ23 బృందం) అసమ్మతి నేతలలో పృథ్వీరాజ్​ కూడా ఉన్నారు.

కమలేశ్వర్​ పటేల్​, దీపికా పాండే సింగ్​ సభ్యులుగా ఉన్నారు. కమిటీ ఎక్స్​ అఫీషియో సభ్యులుగా.. ఆల్​ ఇండియా కాంగ్రెస్​ కమిటీ(ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి, అసోం ఇన్​-ఛార్జి జితేంద్ర సింగ్​; పీసీసీ అధ్యక్షుడు రిపున్​ బోరా; సీఎల్పీ నాయకుడు సైకియాలను నియమించింది కాంగ్రెస్​. వారితో పాటు ఏఐసీసీ కార్యదర్శులు అనిరుధ్​ సింగ్​, పృథ్విరాజ్​ ప్రభాకర్​ సాథే, వికాస్​ ఉపాధ్యాయలను కూడా ఈ జాబితాలో చేర్చింది.

ఈ కమిటీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను పరిశీలించి.. కేంద్ర ఎన్నికల కమిటీకి పంపేందుకు సిఫార్సు చేస్తుంది. సోనియా​ గాంధీ అధ్యక్షతన పార్టీ అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకుంటారు.

126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో.. మూడు దశల్లో(మార్చి 27, ఏప్రిల్​ 1, ఏప్రిల్​ 6) ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

బంగాల్​లో..

బంగాల్​లో 28 మందిని పరిశీలకులుగా నియమించింది ఏఐసీసీ. గుజరాత్, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, బిహార్​, ఝార్ఖండ్​ రాష్ట్రాల కాంగ్రెస్​ నాయకులు ఇందులో ఉన్నారు. కోల్​కతాను నాలుగు భాగాలు(ఉత్తర, దక్షిణ, మధ్య, బుర్రాబజార్​)గా విభజించి.. నలుగురు నేతలకు బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్​.. ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలకు ఇద్దరు చొప్పున నియమించింది. మిగిలిన వారిలో జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యతలు అప్పగించింది.

294 అసెంబ్లీ స్థానాలున్న బంగాల్​లో.. ఎనిమిది దశల్లో ఈ నెల 27 నుంచి ఏప్రిల్​ 29 వరకు పోలింగ్​ జరగనుంది.

ఇదీ చూడండి:అసోం మహిళలతో ప్రియాంక గాంధీ గిరిజన నృత్యం

ABOUT THE AUTHOR

...view details