తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Ajay Mishra News: కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై కోడి గుడ్ల దాడి - కేంద్ర మంత్రిపై కోడిగుడ్డుతో దాడి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్​మిశ్రాకు (Ajay Mishra News) భువనేశ్వర్​లో చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కాన్వాయ్‌పై కాంగ్రెస్​ పార్టీ విద్యార్థి విభాగం నేతలు కొందరు కోడి గుడ్లతో దాడి చేశారు. నల్ల బ్యాడ్జ్​లను ప్రదర్శిస్తూ మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

Union Minister Ajay Mishra
అజయ్​ మిశ్రా

By

Published : Oct 31, 2021, 1:03 PM IST

Updated : Oct 31, 2021, 1:45 PM IST

కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై కోడి గుడ్ల దాడి

ఒడిశా పర్యటనకు వెళ్లిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాకు (Ajay Mishra News) చేదు అనుభవం ఎదురైంది. భువనేశ్వర్‌ విమానాశ్రయం నుంచి కటక్‌లోని సీఐఎస్​ఎఫ్​ క్యాంపస్‌కు వెళ్తున్న మంత్రి కాన్వాయ్‌పై కాంగ్రెస్‌ యువజన కార్యకర్తలు కోడి గుడ్లతో దాడి చేశారు.

మంత్రి కాన్వాయిపై విసిరిన గుడ్లు
కాన్వాయ్​పై గుడ్లు విసురుతున్న నాయకుడు
కాన్వాయ్​పై గుడ్లు విసురుతున్న ఆందోళనకారులు

మంత్రి కాన్వాయ్‌ను ముందుకు పోనివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నిరసనగా.. నల్ల బ్యాడ్జ్​లు ప్రదర్శించారు. మినిస్టర్​ గో బ్యాక్​ అంటూ నినాదాలు చేశారు.

మినిస్టర్​ గో బ్యార్​ అంటూ నినాదాలు
ఆందోళన కారులను అదుపు చేస్తున్న పోలీసులు

అయితే ఇటీవల జరిగిన లఖింపుర్‌ ఖేరి హింసాత్మక ఘటనలో (Lakhimpur Kheri Violence) కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశిష్‌ మిశ్రా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అజయ్‌ మిశ్రా తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఈ పరిణామాల మధ్య ఒడిశాకు చేరుకున్న కేంద్రమంత్రికి కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం నుంచి నిరసన సెగ తగిలింది.

ఇదీ చూడండి:వంద కోసం వార్డుబాయ్ కక్కుర్తి.. ముక్కుపచ్చలారని చిన్నారి బలి

Last Updated : Oct 31, 2021, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details