తెలంగాణ

telangana

ETV Bharat / bharat

2024లో కాంగ్రెస్​కు 300 సీట్లు కష్టమే: గులాం నబీ - సార్వత్రిక ఎన్నికలు 2024

Congress 300 seats in 2024: వచ్చే లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300కు పైగా సీట్లు సాధించాలని ప్రార్థిస్తున్నట్లు ఆ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. అయితే, ఇది వాస్తవరూపం దాల్చే అవకాశాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు ఉపసంహరణపై కీలక వ్యాఖ్యలు చేశారు.

azad congress loksabha 2024
azad congress loksabha 2024

By

Published : Dec 2, 2021, 10:49 AM IST

Congress 2024 winning Ghulam nabi: 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు ఆశాజనకంగా ఉండే అవకాశాలు కనిపించడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. లోక్​సభ ఎన్నికల్లో 300కు పైగా సీట్లను కాంగ్రెస్ సాధించే అవకాశాలపై సందేహం వ్యక్తం చేశారు. అయితే, కాంగ్రెస్ 300కు పైగా స్థానాలు గెలవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. జమ్ము కశ్మీర్​లోని పూంఛ్​లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడిన ఆయన.. ఆర్టికల్ 370 రద్దు ఉపసంహరణపై కీలక వ్యాఖ్యలు చేశారు.

"ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు మాత్రమే నిర్ణయం తీసుకోగలదు. ఆ తర్వాత అధికారం కేంద్రంలో ఉన్న ప్రభుత్వానిదే. ప్రస్తుతం ఉన్న సర్కారే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. వారే దాన్ని ఎలా తిరిగి తీసుకొస్తారు. అయితే, కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో 300 సీట్లు గెలుస్తుందని నేను హామీ ఇవ్వలేను. కాంగ్రెస్ 300 సీట్లు గెలవాలని ప్రార్థిస్తున్నా.. కానీ అది జరిగేలా కనిపించడం లేదు."

-గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ సీనియర్ నేత

జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక అధికారాలు కల్పించే 370వ అధికరణాన్ని 2019లో మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. జమ్ము కశ్మీర్​ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. తగిన సమయంలో కశ్మీర్​కు రాష్ట్ర హోదా కల్పించి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం ఇటీవల పేర్కొంది.

కొద్దిరోజుల క్రితం ఈ అంశంపైనా ఆజాద్ విమర్శలు కురిపించారు. సాధారణంగా కేంద్ర పాలిత ప్రాంతాలను రాష్ట్రాలుగా మార్చడం జరుగుతుందని, కానీ మోదీ సర్కారు రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతానికి దిగజార్చిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం.. డీజీపీని, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ పోస్టుకు బదిలీ చేసినట్టుందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికలకు అనువైన వాతావరణం ఏర్పాటయ్యేలా చూడాలని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:'దేశంలో యూపీఏ కూటమే లేదు.. ప్రత్యామ్నాయం అవసరం'

ABOUT THE AUTHOR

...view details